April 19, 2025
SGSTV NEWS
CrimeTelangana

మా అమ్మను బ్లాక్‌ మ్యాజిక్‌ చేసి చంపారు.. వారాసిగూడ మహిళ మృతి కేసులో సంచలన ట్విస్ట్‌

సికింద్రాబాద్‌ మహిళ డెత్‌ కేసులో మరో ట్విస్టు బయటకు వచ్చింది. తమ తల్లి చనిపోయిన తర్వాతిరోజే ఓ సూసైడ్‌ నోట్‌ రాశారు ఇద్దరు కూతుళ్లు. అందులో వాళ్లు సంచలన ఆరోపణలు చేశారు. తల్లిని బ్లాక్‌ మ్యాజిక్‌ ద్వారా చంపారని ఆరోపణలు చేశారు.. అంతేకాకుండా.. పలువురి పేర్లను, ఫోన్ నెంబర్లను రాయడం సంచలనంగా మారింది. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

వారాసిగూడ డెత్‌ కేసు మిస్టరీగా మారింది. తల్లి శవంతో వారం రోజుల పాటు ఇంట్లో ఉన్న కూతుళ్ల మానసిక స్థితిపైనే ఆందోళన ఉంది. అంతేకాదు ఈ కేసులో రోజుకో ట్విస్టు బయటకు వస్తోంది. జనవరి 22న లలిత మరణించినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టమ్‌ రిపోర్ట్‌ కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాతి రోజు అంటే జనవరి 23న లలిత ఇద్దరు కూతుళ్లు రవలిక, యశ్విత చనిపోడానికి ప్రయత్నించారు. అంతకన్నా ముందు సూసైడ్‌ నోట్‌ రాశారు. అయితే సూసైడ్‌ చేసుకునే ధైర్యం వారికి చాలలేదు. ఇప్పుడు తల్లి లలిత మరణం బయటకు రావడంతో పోలీసుల దర్యాప్తులు ఓ నోట్‌ దొరికింది. దానిలో చాలా విషయాలు రాసుకొచ్చారు.


ఐదేళ్లుగా తండ్రి ఇంటికి రాకపోయేసరికి పలుమార్లు మిస్సింగ్‌ కేసు పెట్టామని.. పోలీసులు పట్టించుకోలేదని రాసుకొచ్చారు. ఇక తన తల్లి చావుకి బిట్ల రమేష్‌, ప్రకాష్‌రెడ్డి, తండ్రి రాజు వారితోపాటు.. ఇంటి ఓనర్లు ప్రియాంక, సుశీల కారణం అంటూ నోట్‌లో సంచలన ఆరోపణలు చేశారు.

తమ ఇంటి ముందున్న కిరాణా షాప్‌ వాళ్లు ఇంటి ఓనర్లు బ్లాక్‌ మ్యాజిక్‌ చేస్తారని చెప్పడంతో.. జనవరి 30కి ఇళ్లు ఖాళీ చేస్తామని చెప్పామన్నారు. ఇంతలోపే.. ఇంటి ఓనర్లతో కలిసి తమ మేనమామ, తండ్రి, బంధువులు బ్లాక్‌ మ్యాజిక్‌ చేసి తల్లిని చంపేశారంటూ ఆరోపించారు.


తమ తల్లి మరణానికి కారణమైన వీరికి కఠిన శిక్ష పడాలంటూ సూసైడ్‌ నోట్‌లో డిమాండ్‌ చేశారు. అంతేకాదు.. ఐదుగురి పేర్లు, ఫోన్‌ నెంబర్లు నోట్‌లో రాశారు రవళిక, యశ్విత..

అయితే వీరి తల్లి లలిత ఎలా చనిపోయిందనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఆమె అనారోగ్యంతో చనిపోయిందా? ఎవరైనా మర్డర్‌ చేశారా అనే విషయం బయటపడాల్సి ఉంది. పోస్ట్‌మార్టమ్‌ రిపోర్టులో అన్ని విషయాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు..

Also read

Related posts

Share via