తమ్ముడి కుల కావరానికి లేడీ కానిస్టేబుల్ బలైపోయింది. కులాంతర వివాహం చేసుకుందని సొంత అక్కనే చంపేశాడు తమ్ముడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ఈ పరువు హత్య తెలంగాణ కలకలం రేపుతోంది.. కులాంతర ప్రేమ వివాహం చేసుకుందని కానిస్టేబుల్ నాగమణిని తమ్ముడు పరమేష్ నరికి చంపాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో జరిగింది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణి.. సోమవారం ఉదయాన్నే స్వగ్రామం రాయపోలు నుంచి హయత్‌నగర్ బయల్దేరింది.. ఈ క్రమంలో నాగమణి కోసం దారికాచిన తమ్ముడు పరమేష్.. ముందుగా కారుతో ఢీకొట్టి.. కత్తితో నరికి దారుణంగా చంపాడు..
పరమేష్ దాడిలో తీవ్రంగా గాయపడిన నాగమణి.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.. కాగా, నాగమణి నెలరోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది.. కులాంతర వివాహాన్ని జీర్ణించుకోలేని తమ్ముడు పరమేష్.. కిరాతకుడిగా మారి సొంత అక్కనే చంపడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు..
రెండో ప్రేమ వివాహం..
2020 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ నాగమణి, శ్రీకాంత్ ప్రేమించుకున్నారు. ఇద్దరూ రాయపోల్ ప్రాంతానికి చెందిన వారే.. శ్రీకాంత్ నాగమణి నవంబర్ ఒకటో తేదీన యాదగిరిగుట్టలో ప్రేమ వివాహం చేసుకున్నారు.. వివాహం అనంతరం హయత్ నగర్ లో నాగమణి శ్రీకాంత్ నివాసం ఉంటున్నాకగ.. నిన్న సెలవు కావడంతో సొంత గ్రామానికి వెళ్ళిన నాగమణి .. ఉదయాన్నే స్కూటీపై పోలీస్ స్టేషన్ కు బయలుదేరింది.. ఈ క్రమంలో నాగమణిని వెంబడించిన తమ్ముడు పరమేశ్ మొదట కార్ తో ఢీ కొట్టి అనంతరం కొడవలితో మెడ నరికి చంపాడు..
హత్య చేసిన పరమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. తన అక్క కానిస్టేబుల్ నాగమణిని హత్య చేసిన తర్వాత పోలీసుల వద్దకు వెళ్లి పరమేష్ లొంగిపోయాడు..
అయితే.. నాగమణి శ్రీకాంత్ ను రెండవ ప్రేమ వివాహం చేసుకుంది. మొదటి భర్తతో విడిపోయింది. నాగమణికి సోదరుడు పరమేష్ ఒక్కడే.. తల్లితండ్రులు లేరు.. హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
Also read
- Hyd Murder: 70 ఏళ్ల వృద్ధురాలిని చంపిన 17 ఏళ్ల బాలుడు.. డెడ్ బాడీపై డ్యాన్స్ చేస్తూ వీడియో తీసి!
- ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..
- ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్.. నాగలక్ష్మీ, సరళ ఎక్కడికి వెళ్లినట్లు..!
- సంబంధం కుదరడం లేదని యువకుడి బలవన్మరణం
- పూజ అయిపోయిన వెంటనే చేయకూడని 5 పనులు ఇవే..అలా చేస్తే దరిద్రం తప్పదు!