SGSTV NEWS
CrimeTelangana

Telangana: గవర్నమెంట్ ఉద్యోగే కానీ అనకొండ.. 100 కోట్లకు పైగానే అక్రమ ఆస్తులు..



ఏడీఈ సతీష్‌ ఆస్తుల లెక్క తేల్చారు ఏసీబీ అధికారులు. లంచం తీసుకున్న కేసులో సతీష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన అధికారులు.. కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు. ఇప్పటివరకు తవ్విన కొద్దీ అక్రమాస్తులు బయటపడుతున్నాయని.. 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని విద్యుత్‌ శాఖలో ఏడీఈగా పని చేస్తున్న సతీష్‌ లంచం తీసుకున్న కేసులో విచారణ కొనసాగుతోంది. సతీశ్‌ ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓ ఇంట్లో ట్రాన్స్‌ఫార్మర్, సీటీ మీటర్‌ బిగించడానికి ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్‌ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వీటిని ఏర్పాటు చేసేందుకు రూ.75 వేలు ఇవ్వాలని ఏడీఈ సతీష్‌ డిమాండ్‌ చేశాడు. మొదట రూ.25 వేలు ఇచ్చాడు. మిగతా 50 వేలు శుక్రవారం అందించగా.. ఇదే సమయంలో ఏసీబీ అధికారులు కార్యాలయానికి చేరుకొని తనిఖీలు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సతీష్‌ను నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు తరలించారు.


ఏసీబీ అధికారులు 2 రోజులపాటు మాదాపూర్‌లోని సతీష్‌ నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. సతీష్‌కు హైదరాబాద్‌, కరీంనగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో 22 ఎకరాల వ్యవసాయ భూమి, విల్లా, ఓపెన్‌ ప్లాట్లు, భవనాలు ఉన్నట్టు గుర్తించారు. నగరంలో ఉన్న కమర్షియల్‌ కాంప్లెక్స్‌లతో ప్రతీ నెల లక్షల రూపాయల కిరాయిలు వస్తాయని అధికారుల విచారణలో తెలింది.

సతీష్‌ ఆస్తుల విలువ రూ.100కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సతీష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంటుందని చెప్తున్నారు

Also read


Related posts