October 18, 2024
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: పగలు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.. రాత్రి మరో డ్యూటీ. గుట్టు రట్టు చేసిన పోలీసులు

సమాజంలో మంచి గుర్తింపు ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ హ్యాపీగా జీవించే అవకాశం ఉన్నా ఓ యువకుడు పక్కదారి పట్టాడు. దొంగగా మారి చివరికి కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన ఇర్ఫాన్‌ హుస్సేన్ (26) ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. మంచి జీతం వస్తుంది. అయితే జల్సాలకు అలవాటు పడ్డాడు..


చిన్న వయసులోనే మంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం, చేతి నిండా సంపాదన బిందాస్‌ లైఫ్‌ ఇంతకంటే జీవితానికి ఏం కావాలని అనుకుంటాం కదూ! అయితే మనిషి అత్యాశే అతని పతనానికి నాంది పలుకుతుంది. ఈ మాట అక్షర సత్యమని నిరూపించే సంఘటనలు నిత్యం సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.


సమాజంలో మంచి గుర్తింపు ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ హ్యాపీగా జీవించే అవకాశం ఉన్నా ఓ యువకుడు పక్కదారి పట్టాడు. దొంగగా మారి చివరికి కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన ఇర్ఫాన్‌ హుస్సేన్ (26) ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. మంచి జీతం వస్తుంది. అయితే జల్సాలకు అలవాటు పడ్డాడు. వచ్చిన జీతంతో తృప్తి చెందలేదు అడ్డదారి తొక్కాడు. పగలు ఉద్యోగం చేస్తూనే రాత్రి దొంగతనాలకు పాల్పడ్డాడు.

రాత్రిపూట మరో ఇద్దరితో కలిసి వాహనాల బ్యాటరీల చోరీకి పాల్పడేవాడు. ఈ క్రమంలోనే ముఠా గుట్టును తలకొండపల్లి పోలీసులు రట్టు చేశారు. ప్రధాన నిందితుడు ఇర్ఫాన్‌ హుస్సేన్‌ (26)ని అరెస్టు చేశారు. ఈ ముఠా గత నెలలో చుక్కాపుర్‌లో 8 ట్రాక్టర్లు, ఓ టిప్పర్‌ బ్యాటరీలను దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హుస్సేన్‌ను అరెస్టు చేసి.. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు

Also read

Related posts

Share via