November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

దొంగల ముఠా తో స్నేహం.. సెటిల్మెంట్ విషయంలో తేడా.. మాజీ కానిస్టేబుల్‌ దారుణ హత్య

రాచకొండ కమిషనరేట్ సరూర్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో మందమల్లమ్మ చౌరస్తా వద్ద ఓ కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాజీ కానిస్టేబుల్ అయినటువంటి ఈశ్వర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. అనంతరం అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే, ఇది యాక్సిడెంట్ కాదని,


అతనొక మాజీ ఎస్ఓటి కానిస్టేబుల్… దొంగల ముఠాతో సంబంధాలు పెంచుకొని చివరకు దొంగగా మారాడు… వసూళ్ల దందాలకు పాల్పడుతూ పెద్ద మొత్తంలో డబ్బులను దోచుకునేవాడు.. దొంగల వద్ద నుంచి దొంగ సొమ్ము కాజేసి బెదిరింపులకు పాల్పడేవాడు.. ఈ విషయం బయటకు రావడంతో కానిస్టేబుల్ ఈశ్వర్ ను సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. ఆ తర్వాత కానిస్టేబుల్ అరాచకాలు మరింత ఎక్కువ అయ్యాయి. దీంతో ముఠా సభ్యుల్లో ఒకరైన ఈశ్వర్‌తో పది లక్షల రూపాయల వద్ద సమస్య తలెత్తడంతో సమస్యను పరిష్కరించుకోవడానికి పిలిచి, కానిస్టేబుల్ ఈశ్వర్ పై హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాజీ కానిస్టేబుల్ ఈశ్వర్ మృతి చెందాడు…


రాచకొండ కమిషనరేట్ సరూర్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో మందమల్లమ్మ చౌరస్తా వద్ద ఓ కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాజీ కానిస్టేబుల్ అయినటువంటి ఈశ్వర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. అనంతరం అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే, ఇది యాక్సిడెంట్ కాదని, మాజీ కానిస్టేబుల్ ఈశ్వర్‌ హత్యాయత్నం చేసినట్లుగా పోలీసుల విచారణలో బయటపడింది.. ఆంధ్రప్రదేశ్ కి చెందిన మేకల ఈశ్వర్ 2010లో కానిస్టేబుల్ గా పోలీస్ విభాగంలో అడుగు పెట్టాడు. ఎస్ ఆర్ నగర్, చిక్కడపల్లి, బేగంపేట్ పోలీస్ స్టేషన్‌లలో టాస్క్ ఫోర్స్ లో పనిచేసేవాడు. మొదట నుండి నేరాలకు సంబంధించినటువంటి విధులను నిర్వహించిన ఈశ్వర్, అప్పట్లో చోరీ కి పాల్పడేటటువంటి దొంగలతో సంబంధాలను పెట్టుకున్నాడు. అలా క్రిమిల్స్‌తో తనకున్న పరిచయాలను వినియోగించుకొని చోరీకి గురైన ఫోన్ ఐ ఎం ఈ ఐ నెంబర్లను సేకరించేవాడు. సెకండ్ హ్యాండ్ మార్కెట్లలో చోరీ ఫోన్లను కొనుగోలు చేసి అలా వాడుతున్నటువంటి వారిని పిలిచి బెదిరించేవాడు.

చోరీ ఫోన్లు మార్కెట్‌లో పట్టుబడటంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్న స్నాచర్లు, దొంగలతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఒక్కొక్క ప్రాంతానికి చెందిన వారిని మరొకచోటకు పంపేవాడు. అక్కడ వారికి అద్దె ఇంట్లో వసతి కల్పించేవాడు. ప్రతి ఒక్కరు రోజుకు కనీసం నాలుగు ఫోన్లను కొట్టేయాల్సిన టార్గెట్ ఉంటుంది. ఆ ఫోన్ల విలువను లెక్కించేవాడు. వాటిని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వ్యాపారస్తులతో సంబంధం పెట్టుకొని వారి నుంచి ప్రతినెలా మామూళ్లు కూడా వసూలు చేసే వాడని తెలిసింది. మరోవైపు ఫోన్లతో పాటు బంగారం, నగలను స్నాచింగ్ చేయించేవాడు. 2022లో నల్గొండ పోలీసులు ఈ తరహా కేసులో ఈశ్వర్‌ని అరెస్టు చేయడంతో అప్పటి హైదరాబాద్ ఈశ్వర్ ఉద్యోగాన్ని తొలగించారు. ఆ తర్వాత అదేపనిగా ఈ దందాకు, వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ముఠా సభ్యులలో కొంతమంది దొంగ సొమ్ము విషయంలో గొడవలు జరిగాయి. సుమారుగా రూ10 లక్షల నగదు గురించి సమస్యలు రావడంతో మాట్లాడదామని రమ్మన్నారు.

మందమల్లమ్మ చౌరస్తా వద్ద ఓ బార్లో సెటిల్మెంట్ కోసం పిలవడం జరిగింది. పంపకాల విషయంలో గొడవలు జరిగి కారుతో ఈశ్వర్ పై హత్యాయత్నం చేశారు. అనంతరం ఆస్పత్రికి తరలించగా మొదటగా యాక్సిడెంట్ గా భావించిన పోలీసులు దర్యాప్తు చేయగా హత్యాయత్నంగా తేలింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈశ్వర్‌ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via