October 17, 2024
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: బాలానగర్ లో వీధి కుక్క స్వైర విహారం…16 మందికి గాయాలు

సంవత్సరం క్రితం ఇదే ప్రాంతంలో ఓ కుక్క 10 మంది పై దాడి చేసిన సంఘటన మరువక ముందే మరో సంఘటన చోటు చేసుకోవటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నుండి విముక్తి

ఓ వీధి కుక్క స్వైర విహారం చేస్తూ, రోడ్డు పై కనిపించిన ప్రతి ఒక్కరినీ కరుస్తూ వెళ్లిన సంఘటన బాలానగర్ లో చోటు చేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ బాలనగర్ పరిధి వినాయకనగర్‌లో వీధి కుక్క స్వైర విహారం చేసింది. ఏకంగా 16మందిని కరిచింది. గాయపడిన వారిలో మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాలనీ వాసుల ఫిర్యాదుతో డాగ్‌స్వ్కాడ్‌ సిబ్బంది దాదాపు 2గంటల పాటు శ్రమించి కుక్కను పట్టుకున్నారు.

మధ్యాహ్న సమయంలో వీధి కుక్క మొదటగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలుడి పై దాడి చేసింది. బాలుడిని కుక్క నుండి కాపాడిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అదే కుక్క సాయి నగర్, వినాయక్ నగర్, రాజు కాలనీలలో తిరుగుతూ మొత్తం 16 మందిపై దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. దాడికి గురైన వారిలో ఏడాదిన్నర వయస్సు నుండి 16 ఏళ్ళ వయస్సు చిన్నారులు, బాలురు ఉన్నారు . వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. సంవత్సరం క్రితం ఇదే ప్రాంతంలో ఓ కుక్క 10 మంది పై దాడి చేసిన సంఘటన మరువక ముందే మరో సంఘటన చోటు చేసుకోవటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నుండి విముక్తి కల్పించాలని కోరుతున్నారు.

కుక్కల బెడద పై అధికారులకు ఇప్పటికీ ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమని, కౌన్సిల్ మీటింగ్ లో సైతం కుక్కల బెడద పై మేయర్ దృష్టికి తీసుకెళ్లినా ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించటం లేదని స్థానిక కార్పొరేటర్ రవీందర్ రెడ్డి అన్నారు

Also read :

Related posts

Share via