November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

Bhadradri Encounter: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టులు హతం..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. మరో ఇద్దరు మావోయిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా లచ్చన్న దళానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గాయపడిన మావోయిస్టులను మణుగూరు ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఈ ఘటనలో మావోయిస్ట్ ముఖ్యనేత కూడా ఉన్నట్లు సమాచారం. ఎన్ కౌంటర్‌లో ఇద్దరు గ్రే హౌండ్స్ పోలీసులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు, ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో పోలీసులు, గ్రేహౌండ్స్‌ దళాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. ఈ గాలింపులో పోలీసులకు రెండు AK 47లు, మూడు SLRలు దొరికాయి. గ్రేహౌండ్స్ చీఫ్‌ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఈ ఆపేర,న్ జరిగింది. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టులను లచ్చన్న దళానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల నుండి లచ్చన్న దళం తప్పించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఇదిలావుండగా, ఛత్తీస్‌గఢ్‌- మహారాష్ట్ర అటవీప్రాంతంలో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన మావోయిస్టు అగ్రనేత మాచర్ల ఏసోబు అలియాస్‌ రణదేవ్‌ మృతదేహం కోసం కుటుంబసభ్యులుగ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. ఆయన స్వగ్రామం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామంలో భారీ బ్యానర్‌ ఏర్పాటు చేశారు. ఏసోబు ఇంటి ముందు టెంట్‌ వేశారు. మృతదేహం వస్తే ఉంచేందుకు ఫ్రీజర్‌ కూడా తీసుకొచ్చి పెట్టారు. గ్రామమంతటా ఎర్రజెండాలు వెలిశాయి.

తాజా వార్తలు చదవండి

Related posts

Share via