ఇటీవల ఎటు చూసినా నేర కథలే అధికంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న నేరాల్లో అధిక శాతం జంట నగరాల్లోనే చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళలో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటివెనుక ఏదో ఒక ముఠా ఆపరేషన్ ఉంటుంది. అయితే జరుగుతున్న ప్రతి ఘటనలోనూ ఒక పాయింట్ కామన్‌గా కనిపిస్తుంది. అదే వాహనం లేకపోవడం. అవును మీకు వాహనం లేకపోతే కచ్చితంగా ఏదో ఒక సమస్యలో ఇరుక్కోవడం పక్కగా కనిపిస్తుంది. వరుసగా జరుగుతున్న ఘటనలను పరిశీలిస్తే ఇదే విషయం నిజమని స్పష్టమవుతుంది. సౌత్ జోన్లో ఎక్కువగా నేరాలు జరగడం సర్వసాధారణం. అయితే ఈ నేరాలు జరగడానికి ప్రధాన కారణం అక్కడ వాహనాలను రాత్రి వేళలో తక్కువగా వాడుతుండటం. మర్డర్ జరిగిన ప్రతిసారి ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే చనిపోయిన వ్యక్తికి ఎలాంటి వాహనము ఉండదు. కచ్చితంగా తాను నడుచుకుంటూ వెళుతున్న క్రమంలోనే ప్రత్యర్ధులు వచ్చి దాడి చేయడం మూకుమ్మడి అటాకులకు పాల్పడటం జరుగుతుంది.
Also read :తిరుమలలో ముదురుతున్న మఠాల వ్యవహారం.. పోరాటానికి పిలుపునిచ్చిన జనసేన..
ఇది కేవలం ఒక హత్య నేరంకు మాత్రమే పరిమితం కాదు. అనేక రకాల నేరాలకు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులే టార్గెట్గా మారుతున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాదులో చైన్ స్నాచర్లతో పాటు మొబైల్ స్నాచర్లు ఎక్కువైపోయారు. ఈ ఘటనలలోనూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారే టార్గెట్గా చేసుకొని నేరాలు జరుగుతున్నాయి. చేతిలో మొబైల్ పట్టుకొని వెళుతున్న వారిని మొబైల్ స్నాచింగ్ ముఠా టార్గెట్ చేసి సెల్ఫోన్లను బైక్ పై వచ్చి అపహరించి పారిపోతున్నారు. ఇక చైన్ స్నాచింగ్లోను ఇదే తతంగం కనిపిస్తుంది. నడుచుకుంటూ ఒంటరిగా వెళుతున్న మహిళలను టార్గెట్గా చేసుకొని చైన్ స్నాచింగ్ ముఠాలు నేరాలకు పాల్పడుతున్నారు. జరుగుతున్న నేరాలు ఎక్కువగా రాత్రుల సమయాల్లోనే ఉంటున్నాయి. వాహనం లేకుండా రాత్రులు నడుచుకుంటూ వెళుతున్న వారే ఎక్కువగా నేరస్తులకు టార్గెట్గా మారుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఏడు హత్యలలోను ఇదే కీలక పాయింట్‌గా కనిపిస్తోంది. ఏదైనా నేరం జరిగితే రాత్రి వేళలో సహాయం చేయడానికి కూడా చుట్టుపక్కల వారు ఎవరు ఉండరు. కాబట్టి రాత్రి సమయంలోనే ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి.
Also read:Hyderabad: ఛీ.. ఛీ.. కాపాడాల్సిన పోలీసే..కామవాంచతో బాలికపై అత్యాచారం