బ్యాంకులో కూడా తీసుకోవడం లేదని బంకు సిబ్బంది చెప్పడంతో హరీష్ వారితో వాగ్వాదానికి దిగాడు. అయినప్పటికీ వారు చిల్లర డబ్బులు తీసుకోకపోవడంతో నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో బంకు యాజమాన్యం పై ఫిర్యాదు చేశాడు హరీష్. తరచూ ఎస్సార్ బంక్ పై పలు ఆరోపణలు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓ పెట్రోల్ బంక్ లో వినియోగదారుడికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. రూపాయి,రెండు రూపాయల బిళ్ళలు చెల్లవంటూ బంకు సిబ్బంది చెప్పడంతో అవాక్కైన వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం తిరుమాలాపురంలో చోటు చేసుకుంది. బంకులో పనిచేసే వ్యక్తే కస్టమర్ వద్ద ఉన్న చిల్లర కాయిన్లను చూసి ఫోన్ పే చేస్తేనే పెట్రోల్ కొడతానని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వీరి పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది..పూర్తి వివరాల్లోకి వెళితే..
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామానికి చెందిన హరీష్ అనే యువకుడు తన బైక్ లో పెట్రోల్ కొట్టించుకునేందుకు తిరుమాలాపురం వద్ద ఉన్న ఎస్సార్ పెట్రోల్ బంకుకు వెళ్ళాడు. బంక్ సిబ్బంది తో163 రూపాయల పెట్రోల్ కొట్టమని చెప్పి అందుకు సరిపడా చిల్లర ఇచ్చాడు. రూపాయి బిళ్ళలు చెల్లడం లేదని ఫోన్ పే చేయాలని హరీష్ కు సిబ్బంది సూచించారు. బ్యాంకులో కూడా తీసుకోవడం లేదని బంకు సిబ్బంది చెప్పడంతో హరీష్ వారితో వాగ్వాదానికి దిగాడు. అయినప్పటికీ వారు చిల్లర డబ్బులు తీసుకోకపోవడంతో నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో బంకు యాజమాన్యం పై ఫిర్యాదు చేశాడు హరీష్. తరచూ ఎస్సార్ బంక్ పై పలు ఆరోపణలు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Also read :
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో
- విదేశీ అమ్మయిలతో వ్యభిచారం.. ముఠా గుట్టురట్టు