గోదావరి నదిలో పడిపోయిన బంగారు గొలుసు తిరిగి దొరుకుతుంది అని ఎవరైనా అనుకుంటారా..? కానీ అలాంటి ఘటన జరిగింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి చెంత ఈ అరుదైన ఘటన వెలుగుచూసింది. గోదావరి నదిలో స్నానాలు చేస్తుండగా మెడలో నుంచి జారిపోయింది బంగారు గొలుసు. అయితే అక్కడే ఉన్న గజఈతగాళ్లు ఆ చైన్ వెతికిపెట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య చెంతన ఉన్న గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానం చేస్తుండగా గోల్డ్ చెయిన్ అనుకోకుండా పడిపోయింది. అయితే మన సొమ్ము అయితే తిరిగి మనకే చేరుతుంది అన్న చందంగా.. తిరిగి ఆ గొలుసు గజ ఈతగాళ్లకు దొరకడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పూర్తి డీటేల్స్‌లోకి వెళ్తే.. ఖమ్మం నగరానికి చెందిన సురేందర్.. తన ఫ్యామిలీతో కలిసి భద్రాద్రి రామయ్య దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో ముందుగా గోదావరిలో స్నానమాచరించాలనుకున్నారు. అయితే స్నానం చేస్తుండగా మెడలోని గోల్డ్ చైయిన్ జారిపోయి నీటిలో పడిపోయింది.
దీంతో వారంతా ఆందోళన చెందారు. ఏం చేయాలో తెలియక అక్కడే ఉన్న గజ ఈతగాళ్లకు విషయం చెప్పారు. అంత పెద్ద గోదావరి నదిలో ఆ గొలుసు కనిపెట్టడం అంటే మాములు విషయం కాదు. కానీ మానవ ప్రయత్నం ఉంటే.. దైవ సహకారం కూడా ఉంటుంది కదా అని గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. అక్కడే ఉన్న మరి కొంతమంది స్థానికులు కూడా సాయమొచ్చారు. మొత్తం 9 మంది కలిసి నదిలో గొలుసు కోసం గాలింపు జరపుతుండగా.. కొద్దిసేపటికే అది దొరికింది. దాదాపు రూ.లక్షా 30 వేల విలువైన 15 గ్రాముల గోల్డ్ చైయిన్‌ను దొరకపట్టి గజ ఈతగాళ్లు సురేందర్‌కు అందజేశారు. దాదాపు పోయినట్టే అనుకున్న గొలుసును.. తిరిగి గజ ఈతగాళ్లు వెతికిపెట్టడంతో సురేందర్ వారికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో నదిలో ప్రమాదవశాత్తూ మునిగిపోతున్న చాలామంది భక్తులను కూడా గజ ఈతగాళ్లు రక్షించి బయటికి తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





