SGSTV NEWS
CrimeTelangana

Nalgonda: రైతులకు రోడ్డు పక్కన పొలంలో కనిపించిన సంచి.. ఓపెన్ చేసి చూడగా….



రోజు మాదిరిగానే రైతులు వ్యవసాయ పనుల కోసం పొలాల వద్దకు వెళ్లారు. పొలంలో కనిపించిన సంచిని చూసి రైతులు షాక్ తిన్నారు. సంతోషంగా సంచిలోని కొన్నింటిని రైతులు ఇంటికి తీసుకువెళ్లారు. తీరా వాటిని పరిశీలించి షాక్ తిన్నారు. ఇపుడు జిల్లాలో ఆ కట్టలు కలకలం సృష్టించాయి. అయితే రైతులకు పొలంలో ఏం కనిపించాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.


నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తల పాలెంలో రోజు మాదిరిగానే రైతులు వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లారు. నార్కెట్ పల్లి – అద్దంకి రహదారి వెంట ఓ రైతు పొలంలో కరెన్సీ కట్టలు ప్రత్యక్షమయ్యాయి. రైతులకు పొలాల్లోని నోట్ల కట్టలతో కూడిన సంచి కనిపించింది. సంచిలో నిండుగా ఉన్న కరెన్సీ కట్టలను ఎవరో అక్కడి వదిలి వెళ్లినట్లు రైతులు గుర్తించారు. రూ.500 నోట్లతో పేర్చిన 40 కట్టలు చూసిన రైతులు కొన్ని కరెన్సీ కట్టలను తమ వెంట తీసుకెళ్లారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో రూరల్ సీఐ వీరబాబు స్థానికుల నుంచి వివరాలు సేకరించి మిగిలిన నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. అచ్చుగుద్దినట్టుగా అసలు నోట్లను పోలి ఉన్న ఈ నోట్లపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉంది. ఈ నోట్ల కట్టలు ఎందుకు వినియోగిస్తారనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.




నకిలీ రూ.500 కట్టలు పంట పొలంలో ప్రత్యక్షమవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. దొంగనోట్ల ముఠా పని కావొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దామరచర్ల మండలంలో దొంగనోట్ల చలామణి జరిగిన ఘటనలు ఉన్నాయి. అదే ముఠా మళ్లీ దొంగ నోట్ల చలామణికి పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు నిఘా పెట్టి దొంగనోట్ల ముఠాను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ నోట్లు అక్కడికి ఎలా వచ్చాయి, వాటిని ఎందుకు వినియోగిస్తున్నారనేది విచారణలో తేలుతుందని పోలీసులు చెబతున్నారు

Also Read

Related posts

Share this