March 13, 2025
SGSTV NEWS
CrimeTelangana

Sangreddy: ఛీ మీరేం మనుషులు రా.. చాక్లెట్ కొనిస్తామని 8 ఏళ్ల పాపను తీసుకెళ్లి..



సంగారెడ్డి జిల్లాలో దారుణం ఘటన వెలుగుచూసింది. 8 ఏళ్ల పాపపై ఇద్దరు యువకులు లైంగిక దాడి చేశారు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను చాక్లెట్‌ కొనిస్తామని చెప్పి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. పాప కనిపించకపోయేసరికి వెతుకుతుండగా… తీవ్ర రక్తస్రావంతో దగ్గర్లోని పొదల వద్ద కనిపించింది. వెంటనే బాధితురాలిని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు.


సంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు యువకులు అభంశుభం తెలియని, ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం రాత్రి సంగారెడ్డి గ్రామీణ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సంగారెడ్డి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక ఇంటి ముందు గురువారం రాత్రి ఆడుకుంటుండగా మద్యం మత్తులో అటుగా వెళ్లిన ఇద్దరు యువకులు పాపకు చాక్లెట్ ఇస్తామని చెప్పి.. సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు.


ఇంటి ముందు బాలిక లేకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో గాలించారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో పొదల మధ్య బాలిక ఉన్నట్లు గుర్తించారు. అదే కాలనీకి చెందిన ఇద్దరు యువకులు… లైంగిక దాడి చేసినట్లు బాలిక కుటుంబీకులకు తెలిపింది. వెంటనే స్థానికులు ఆ ఇద్దరు నిందితులను గాలించి పట్టుకొని దేహశుద్ధి చేసి… పోలీసులకు అప్పగించారు. బాలికను పోలీసులు వైద్య చికిత్స కోసం సంగారెడ్డిలోని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Also read

Related posts

Share via