మద్యం మత్తులో మందుబాబులు హల్చల్ చేశారు.. హల్చల్ చేయడం వరకు ఓకే.. కానీ, ఏకంగా పోలీసుల పైనే తిరగబడ్డారు.. డ్రంక్ డ్రైవ్ చెక్ చేస్తున్న పోలీసులపై మందు బాబులు దాడి చేయడం అందర్నీ షాక్‌కి గురి చేసింది.. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా శివంపేట్ ప్రధాన రహదారి భారత్ గ్యాస్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపైనే దాడి చేశారు ఐదుగురు మందుబాబులు.. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. శివంపేట నుంచి చండీ వైపు వస్తున్న ఒక బైకు పై ముగ్గురు, మరో బైక్ పై ఇద్దరు ప్రయాణిస్తున్నారు.. అయితే వారు హెల్మెట్ ధరించలేదు.. అంతేకాకుండా మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి డ్రంక్ అండ్ డ్రైవ్ కు సహకరించాలని కోరారు స్థానిక పోలీసులు.. దీంతో మద్యం మత్తులో ఉన్న మందుబాబులు రెచ్చిపోయారు.. మమ్మల్ని అపుతారా అనిబూతులు తిడుతూ ఇష్టానురీతిన మాట్లాడుతూ చిందులేశారు.. అంతటితో ఆగకుండా చేతులతో అక్కడ ఉన్న ముగ్గురు పోలీసులపై దాడి చేశారు.. దీన్ని ఆపడానికి వచ్చిన మరో ఇద్దరు పోలీసులపై సైతం దాడి చేయడంతో వారంతా షాక్ కి గురయ్యారు..
చివరకు స్థానికంగా పనిచేసే భారత్ గ్యాస్ సిబ్బంది సహకారంతో ఆ ఐదుగురు మందుబాబులను అతి కష్టం మీద పోలీస్ స్టేషన్ కు తరలించారు.. అయితే.. మళ్ళీ పోలీస్ స్టేషన్లో సైతం పోలీసుల గల్లాలు పట్టి, బూతు మాటలు తిడుతూ దాడికి యత్నించారు మందు బాబులు..
దీంతో ఎండీ రషీద్, బనావత్ సైద నాయక్, బుక్య బీమా నాయక్, గంగ్లోత్ గోపి నాయక్, బనావత్ నందు నాయక్ లపై శివంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించి, దూషిస్తూ విచక్షణ రహితంగా దాడి చేసినందుకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టామని శివంపేట పోలీసులు వెల్లడించారు
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!