తనను మద్యం వ్యాపారి వేధిస్తున్నాడని.. ట్యాంక్ పై నుంచి దూకుతానని బెదిరించాడు.. అప్పటికే మద్యం మత్తులో ఉన్నాడు.. దీంతో అందరూ అక్కడికి వచ్చి సముదాయించే ప్రయత్నం చేశారు.. పోలీసులు కూడా చేసుకున్నారు.. నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగా.. మద్యం మత్తులో ఉన్న అతను.. ఒక్కసారిగా పట్టు తప్పి కింద పడిపోయాడు.
తనను మద్యం వ్యాపారి వేధిస్తున్నాడని.. ట్యాంక్ పై నుంచి దూకుతానని బెదిరించాడు.. అప్పటికే మద్యం మత్తులో ఉన్నాడు.. దీంతో అందరూ అక్కడికి వచ్చి సముదాయించే ప్రయత్నం చేశారు.. పోలీసులు కూడా చేసుకున్నారు.. నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగా.. మద్యం మత్తులో ఉన్న అతను.. ఒక్కసారిగా పట్టు తప్పి కింద పడిపోయాడు. అందరూ చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. చావు బతుకుల మధ్య..ఆ వ్యక్తిని పోలీసులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని అంబేద్కర్ నగర్ కు చెందిన యతిరాజు చంద్రశేఖర్ అనే వ్యక్తిని మద్యం వ్యాపారి కులం పేరుతో తిట్టాడు.. దీంతో తాను చనిపోతానని అక్కడినుంచి వెళ్లాడు.. అనంతరం స్థానిక జవహర్ నగర్‌లో సింగరేణి స్టేడియం ప్రక్కన గల ప్రధాన వాటర్ ట్యాంకు పైకి ఎక్కి దూకుతానని హెచ్చరించాడు. దీంతో స్థానికులు తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఈ క్రమంలోనే.. గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు సైతం చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు.
వీడియో చూడండి..
ఈ క్రమంలోనే.. చంద్రశేఖర్ వాటర్ ట్యాంకు ఎక్కడానికి గల కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తుండగానే… మద్యం మత్తులో ఉండడంతో అంతలోనే అదుపు తప్పి అమాంతం కిందపడ్డాడు.. ప్రజలంతా చూస్తుండగానే వాటర్ ట్యాంక్ పై నుంచి కింద పడి చంద్రశేఖర్ కు తీవ్రగాయాలయ్యాయి.. అతని చేయి విరిగి తీవ్ర రక్తస్రావం జరిగింది.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న చంద్రశేఖర్ ను గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు తమ వాహనంలో హుటాహుటిన గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన చూసిన వారంతా ఒక్కసారిగా ఆందోళన చెందారు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- BREAKING: అఘోరి అరెస్ట్.. కారుతోపాటు ఈడ్చుకెళ్లిన పోలీసులు!
- ట్యాక్సీ డ్రైవర్‌తో కూతురు వివాహం.. తండ్రి, సోదరుడు అతికిరాతంగా ఏం చేశారంటే?
- TDP నాయకుడు దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి నరికి
- కాకినాడలో విషాదం.. పసిపిల్లల పాలిట మృత్యువుగా మారిన తండ్రి
- Hyderabad: అనుమానాస్పదంగా ఫుడ్ డెలివరీ బాయ్.. డౌట్ వచ్చి.. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా