April 3, 2025
SGSTV NEWS
CrimeSpiritualTelangana

ఉదయాన్నే  ఆలయం ఓపెన్ చేసి నిర్ఘాంతపోయిన అర్చకుడు.. గర్భగుడి గోడకు



పురాతన, చారిత్రక ఆలయాలను లక్ష్యంగా చేసుకొని ఆగంతుకులు గుప్త నిధుల కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నారు. ఏమాత్రం కష్టపడకుండా రాత్రికి రాత్రి ధనవంతులు అయిపోవాలని కొందరు కలలు కంటారు. అలాంటివారు ఈ తరహా చర్యలకు పాల్పడుతూ ఉంటారు. లంకె బిందెలు, గుప్త నిధుల కోసం తవ్వకాల ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో తరచూ వెలుగుచూస్తూనే ఉంటాయి. తాజాగా..


రాత్రి రాత్రే ధనవంతులు కావాలని దురాశ.. ఒక్కరోజులో దశ తిరిగిపోవాలన్న దుర్భుద్ది అసాంఘిక చర్యల వైపు పురిగొల్పుతాయి. ఈ క్రమంలోనే కొందరు గుప్త నిధుల కోసం పురాతన దేవాలయాలు టార్గెట్‌గా రెచ్చిపోతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కంభాలపల్లి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్‌లో గుప్త నిధుల కోసం గర్భగుడికి డ్రిల్లింగ్ మిషన్ ద్వారా రంధ్రాలు చేసిన ఘటన వెలుగుచూసింది. గుడి పూజారులు రోజు మాదిరిగానే శనివారం రాత్రి స్వామి వారికి పూజలు చేసిన అనంతరం తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఆలయానికి వచ్చి చూడగా, గర్భగుడికి డ్రిల్లింగ్ మిషన్తో రంధ్రాలు చేసి ఉండటాన్ని ఓ అర్చకుడు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ చర్యకు పాల్పడి ఉంటారని.. ఆలయంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా ఇలాంటి ఘటనలు అడ్డుకోవచ్చన్నారు.


కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారని..  చాలా మహిమగలదని గ్రామస్థులు చెబుతున్నారు. గతంలో కూడా దేవాలయంలో దొంగతనాలు జరిగిన దాఖలాలు ఉన్నాయట. ఉద్దేశపూర్వకంగా ఈ పని చేసినట్లు అనిపిస్తుందని.. దేవునితో ఆటలు ఆడితే అందుకు తగ్గ ఫలితాలు ఉంటాయని భక్తులు హెచ్చరిస్తున్నారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపాలని చూసిన ఆగంతకులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దని పోలీసులను కోరుతున్నారు

Also read

Related posts

Share via