వరంగల్ మెడికవర్‌లో డాక్టర్‌గా వర్క్ చేస్తున్న సృజన్ ఓ ఇన్ఫ్లూయెన్సర్ మోజులో పడి, భార్య ప్రత్యూషకు విడాకులు ఇస్తానని బెదిరించారు. ఆ యువతి మోజులో పడి తనని, పిల్లలను పట్టించుకోవడం లేదని మనస్తాపం చెంది డాక్టర్ ప్రత్యూష్ పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
పరస్త్రీ మోజులో పడి కట్టుకున్న భార్యను పట్టించుకోని ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ఇటీవల వరంగల్‌లోనూ ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇక ఇన్ఫ్లూయెన్సర్‌పై ఉన్న మోజుతో తన భర్త తనని దూరం పెట్టాడని ప్రత్యూష అనే వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. హసన్‌పర్తిలోని తన ఇంట్లో పురుగుల మందు తాగి ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది. అయితే ప్రత్యూష భర్త సృజన్ వరంగల్ మెడికవర్ హాస్పిటల్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ప్రత్యూష అక్కడ వేరే ఆసుపత్రిలో పనిచేస్తుంది. అయితే వీరికి కొన్నేళ్ల కిందట పెళ్లి కాగా ఇద్దరూ పిల్లలు ఉన్నారు.
పెళ్లి అయిన కొత్తలో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ మధ్యలో ఓ ఇన్‌స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ మోజులో పడి సృజన్ తన కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఆ ఇన్ఫ్లూయెన్సర్‌ను పెళ్లి చేసుకుంటానని, విడాకులు ఇస్తానని ప్రత్యూషను బెదిరించేవాడు. ఎవరికైనా చెబితే ఇదే పని చేస్తానని ఆమెను బెదిరించాడు. దీంతో మానసిక ఆవేదన చెందిన ప్రత్యూష తీవ్రంగా ఒత్తిడికి గురైంది. చివరకు ఈ బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సృజన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్‌కు, సృజన్‌కు ప్రమోషనల్ ఇంటర్వ్యూ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం క్లోజ్‌గా మారింది. ఈమె మాయలో పడిన సృజన్ భార్య, పిల్లలను పట్టించుకోకుండా విచ్చలవిడిగా తిరిగారు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ యువతికి 2 లక్షల పైనే ఫాలోవర్స్ ఉన్నారు. బుట్టబొమ్మ పేరుతో సోషల్ మీడియాలో రీల్స్, ప్రమోషన్స్ చేస్తోంది. ఈమె వల్ల సృజన్ మారాడని ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఇన్ఫ్లూయెన్సర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని ప్రత్యూష తల్లిదండ్రులు కోరుతున్నారు.
Also read
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి
- Andhra: వైష్ణవిని ప్రియుడు చంపలేదు.. ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు..