SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: ఆశ్లీల వీడియోలు చూసి ఆఘాయిత్యం.. ఏం చేశారో తెలిస్తే.. రక్తం మరగాల్సిందే..

 

మొబైల్‌ ఫోన్స్‌, ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చాక యువతలో చాలా మంది అశ్లీల వీడియోలకు అలవాటు పడుతున్నారు. కొంతమంది ఏకంగా వాటికి బానిసలైన నిజ జీవితంలో అలానే చేయాలని.. కనిపించిన అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌ నగరంలో వెలుగు చూసింది. అశ్లీల వీడియోలకు అలవాటు పడిన ఇద్దరు యువకులు ముగ్గురు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడి పోలీసులకు దొరికి పోయారు.

అశ్లీల వీడియోలు చూపి ముగ్గురు చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడిన నిండుతుడిని సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. బాధిత బాలికల్లో ఇద్దరు అక్కా చెల్లెలున్నారు. సైదాబాద్ పోలీస్టేషన్ పరిధిలోని ఓ బస్తీలో నివసిస్తున్న ఇద్దరు అక్కా చెల్లెలు (10, 9), మరో బాలిక(9) స్థానిక స్కూల్లో చదువుతున్నారు. ఇటీవల వారు తరగతి గదిలో పిల్లలు ఎలా పుడుతారనే విషయంపై అసభ్యకరంగా మాట్లాతుండటం విన్న ఓ టీచర్.. వెంటనే తల్లిదండ్రులను స్కూల్ కు పిలిపించి జరిగిన విషయం చెప్పారు. దీంతో తల్లిదండ్రులు పిల్లలను నిలదీసి అడగ్గా.. జరిగిన ఘోరాన్ని వివరించారు.

ఆగస్టు సెలవుల్లో ఇంటి ముందు ఆడుకుంటుండగా ఇర్ఫాన్ చాక్లెట్ ఇస్తానని చెప్పి ఇంటికి తీసుకెళ్లి అశ్లీల వీడియోలు చూపించి అఘాయిత్యం చేశాడని తెలిపారు. విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించినట్లు బాలికలు తల్లిదండ్రులకు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇక రెండో ఘటనలో, ఓ 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసి ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్న విజయ్ అనే యువకుడిని సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఏడాది క్రితం యువకుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు. ఆ సమయంలో తీసిన ఫోటోలతో బెదిరించి పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read

Related posts