ఓ బీటెక్ విద్యార్ధి ప్రమాదం నుంచి తమ కుటుంబ సభ్యులను కాపాడాలని ప్రయత్నించాడు. అందులో భాగంగా తీవ్ర ప్రయత్నాలు చేశాడు. కట్ చేస్తే.. చివరి అతడే తీవ్ర గాయాలు పాలై.. ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఆ స్టోరీ ఇలా ఉంది.
ఇంట్లో గ్యాస్ లీక్ అవుతుందని గమనించి తన కుటుంబ సభ్యులను కాపాడే ప్రయత్నంలో యువకుడి మృతి చెందిన ఘటన రామచంద్రపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని భారతీనగర్ డివిజన్‌లో ఎల్‌ఐజీ కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా విషాదం సంభవించింది. ఈ ఘటనలో ఆనంద్ స్వరూప్ అనే బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. వారి ఇంట్లో సిలిండర్ లీక్ అవుతుండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు జాగ్రత్తతో బయటకు వెళ్లారు.
అయితే సిలిండర్ మార్చే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఒకేసారి సిలిండర్ పేలడంతో ఆనంద్ స్వరూప్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ చివరికి మృతిచెందాడు. సిలిండర్ మార్చే క్రమంలో హఠాత్తుగా పేలుడు సంభవించిందని.. అది ఒక్కసారిగా జరిగిపోయిందని మృతుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు
Also read
- ఏంతకు తెగించావురా… బంగారం కావాలంటే కొనుక్కోవాలి… లాక్కోకూడదు.
- ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్‌తో దాడి.. ఆ తర్వాత సీన్ ఇదే!
- అర్ధరాత్రి వేళ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. డ్రైవర్ పొట్టలోకి దిగిన వెదురు బొంగులు!
- గుంటూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఆరుగురి అరెస్ట్*
- నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది….





