ములుగు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ్ముళ్ల కోసం పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని త్యాగం చేసిన అన్న అదే తమ్ముడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. విజయ్ బాబు అనే గిరిజనుడు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. సొంత తమ్ముడే అతన్ని కొట్టి చంపి హైడ్రామా క్రియేట్ చేశాడని గుర్తించారు. నిందితుడి అరెస్ట్ చేసి పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు.
ఈ ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో జరిగింది. విజయ్ బాబు అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో అతని ఇనుపరాడితో కొట్టి చంపారు. తెల్లవారగానే అతని తమ్ముడు పోలీసులకు సమాచారం అందించాడు. తన అన్నను ఎవరో చంపారని, నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చి హతమార్చారని పోలీసులను నమ్మించాడు. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. ముసుగులు ధరించి వచ్చిన వ్యక్తులు ఎవరని ఆరా తీశారు. చివరకు అదంతా హైడ్రామా అని గుర్తించారు. సొంత తమ్ముడు బుల్లబ్బాయి హంతకుడని తేల్చారు. చివరికి బుల్లబ్బాయిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
అయితే ఇద్దరు తమ్ముళ్ల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన విజయ్ బాబు అదే తమ్ముడు చేతిలో హత్యకు గురవడం ఇక్కడ ప్రతి ఒక్కరు హృదయాలను చలింప చేసింది. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో తన తమ్ముళ్లు బుల్లబ్బాయి, రాజేంద్రప్రసాద్ ల బాధ్యత తన భుజాలపై చేసుకున్న విజయబాబు పెళ్లి కూడా చేసుకోలేదు. తన తమ్ముళ్లే జీవితమని వాళ్ల కోసమే జీవిస్తున్నారు. కానీ మద్యానికి బానిసైన బుల్లబ్బాయి తాగడానికి డబ్బులు ఇవ్వలేదని అన్నను హతమార్చాడు.
బుధవారం(ఏప్రిల్ 9) రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో తనకు డబ్బులు కావాలని అన్న విజయబాబును డిమాండ్ చేశాడు. కానీ డబ్బులు లేవని గట్టిగా మందలించడంతో నిద్రమత్తులో ఉన్న అన్నను అతి దారుణంగా ఇనుపరాడ్డుతో కొట్టి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
Also read
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!
- కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు కొడుకులను నరికి భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే