ఆమెకు పెళ్లైంది.. కొన్నేళ్ల తర్వాత ఆమెకు భర్తతో మనస్పర్థలు వచ్చాయి.. దీంతో ఆమె వేరుగా ఉంటుంది.. భర్తకు దూరంగా ఉంటూ జీవనం కొనసాగిస్తోంది.. ఈ క్రమంలో ఆమెకు బంధువైన ఓ కానిస్టేబుల్.. ఒంటరిగా ఉంటున్న వివాహితపై కన్నేశాడు.. ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడటం.. అలాగే వేధించడం మొదలుపెట్టాడు.. చివరకు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను.. దగ్గరి బంధువులకు పంపించి.. ఆమె పరువుతీశాడు.. దీంతో మనస్తాపం చెందిన ఆమె బలవన్మరణానికి పాల్పండింది.. ఓ కానిస్టేబుల్ వేధింపులు వివాహిత ఆత్మహత్యకు కారణమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో చోటుచేసుకుంది.
పాల్వంచ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికలాంగుల కాలనీకి చెందిన త్రివేణి (32) కి సుజాతనగర్‌కు చెందిన బి.వీరయ్య అనే వ్యక్తితో పదేళ్ల క్రితం పెళ్లైంది.. ఆ తర్వాత కొంత కాలానికి ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.. గొడవలు పెరగడంతో బీరయ్య, త్రివేణి ఇద్దరూ కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు.
ఈ క్రమంలోనే త్రివేణి మరిది ఆమెపై కన్నేశాడు.. త్రివేణికి వరుసకు మరిది అయ్యే ఖమ్మం జిల్లా చింతకాని మండలం, నాగారం గ్రామానికి చెందిన టీజీఎస్పీ కానిస్టేబుల్ నాగరాజు.. ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.. త్రివేణికి ఫోన్‌చేసి అసభ్యకరంగా మాట్లాడడం, తిట్టడం లాంటివి చేస్తున్నాడు..
ఇలా కొన్నిరోజుల తర్వాత.. ఆమెతో ఉన్న ఫొటోలను నాగరాజు.. త్రివేణి బంధువుల ఫోన్లకు పంపించి పరువుతీశాడు. దీంతో మనస్తాపం చెందిన త్రివేణి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని మృతిచెందింది.. త్రివేణి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పాల్వంచ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Also read
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో
- విదేశీ అమ్మయిలతో వ్యభిచారం.. ముఠా గుట్టురట్టు