April 11, 2025
SGSTV NEWS
CrimeTelangana

ఆరు బయట కూర్చొన్న తల్లీకొడుకులపై గొడ్డలితో దాడి.. కొడుకు మృతి, తల్లి సీరియస్!

హైదరాబాద్ మహానగరం బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మద్య మత్తులో సమీప బంధువులపై గొడ్డలితో దాడి తెగబడ్డాడు ఓ దుండగుడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అతని తల్లి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


పాత కక్షల నేపథ్యంలో క్రూరంగా ఇద్దరు వ్యక్తులపై గొడ్డలితో దాడి చేశాడు. ఎరుపుల ముకేందర్(42), తన కుటుంబంతో సహా బాలానగర్ పరిధిలోని సంజీవయ్య కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇంటి పక్కనే బంధువులు ఎరుపుల మధు తన కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. ఈ ఇరు కుటుంబాలు, దాయాదులు అవ్వటం, వారి మధ్య తాతల నాటి నుండి వైరం కొనసాగుతోంది. తరచూ ముకేందర్, మధు కుటుంబాల మధ్య స్వల్ప వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే మంగళవారం(ఆగస్ట్ 27) మధ్యాహ్నం ముకేందర్, తన తల్లి సావిత్రి కలిసి ఇంటి ఆరుబయట కూర్చొని ఉండగా, మధు గొడ్డలితో ముకేందర్‌పై ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. అడ్డు వచ్చిన అతని తల్లి సావిత్రిపై సైతం దాడికి పాల్పడగా తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ముకేందర్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతని తల్లి సావిత్రి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

కాగా, ఈ ఘటనకు పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ నవీన్ కుమార్ తెలిపారు. కాగా మధు గంజాయి సేవించే అలవాటు ఉందని, గతంలో వాహనాల చొరీల కేసులో, పలువురిపై దాడికి పాల్పడి జైలుకు వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.

Also read

Related posts

Share via