భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట SI శ్రీరాముల శ్రీనివాస్.. ఈ ఉదయం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక జూన్ 30వ తేదీన ఆయన పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్టేషన్ నుంచి కారులో వెళ్లిన ఆయన.. పురుగుల మందు తాగి ఆత్మాహత్యాయత్నం చేశారు.
Also read :Hyderabad: చిందేస్తూ గుప్పున గుంజారు.. పోలీసుల ఎంట్రీతో ఉరుకులు పరుగులు.. కట్ చేస్తే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట SI శ్రీరాముల శ్రీనివాస్ (38).. ఈ ఉదయం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక జూన్ 30వ తేదీన ఆయన పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్టేషన్ నుంచి కారులో వెళ్లిన ఆయన.. పురుగుల మందు తాగి ఆత్మాహత్యాయత్నం చేశారు. చివరకు ఫోన్ చేసి కుటుంబసభ్యులకు చెప్పడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే.. పురుగుల మందు తాగటంతో శరీరంలోని కిడ్నీలు సహా పలు అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు వెల్లడించారు.
ఎస్‌ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ ఏంటంటే చనిపోయే ముందు ఆయనిచ్చిన మరణ వాంగ్మూలం. అశ్వారావుపేటలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న వాస్తవాలను బయటపెట్టారు. కానిస్టేబుల్స్ సన్యాసి నాయుడు, శేఖర్, సుభాని, శివనాగరాజు కుమ్మక్కై… స్టేషన్‌కి కొత్తగా వచ్చిన ఎస్సైలను తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారని ఆరోపించారు. ఈ నలుగురు కానిస్టేబుల్స్, ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ కలిసి మీడియాకు లీక్‌లు ఇచ్చి.. ఎస్సైని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఎస్‌ఐ శ్రీనివాస్ వాంగ్మూలంలో వెల్లడించారు. వీరికి స్థానిక సీఐ కూడా వంతపాడి తనను మానసికంగా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు.
ఎస్సై శ్రీను స్వగ్రామం నారక్కపేట.. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. తన భర్త చావుకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ శ్రీనివాస్ భార్య కృష్ణవేణి.. మూడ్రోజుల క్రితం హైదరాబాద్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారు. అది మహబూబ్‌బాద్ పీఎస్‌కు బదిలీ కావడంతో సీఐ, మరో నలుగురిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో ఎస్‌ఐ శ్రీనివాస్ ఉదయం యశోద ఆస్పత్రిలో చనిపోవడం, ఆయన మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
వీడియో…
https://x.com/AduriBhanu/status/1809930361343717834?t=8Ptg_xutE8cBJWtuZ0o5zg&s=19
సీఐపై చర్యలు..
కాగా.. అశ్వారావుపేట ఎస్ఐ శ్రీనివాస్ ఆత్మహత్య కేసులో.. 3రోజుల క్రితం అశ్వారావుపేట CI జితేందర్‌రెడ్డి ఐజీ ఆఫీసుకు అటాచ్ చేశారు. మరో నలుగురు కానిస్టేబుల్స్ శివ, సుభాని, పీఎస్ నాయుడు.. శేఖర్‌లను జిల్లా ఎస్పీ ఆఫీస్‌కి అటాచ్ చేశారు