June 29, 2024
SGSTV NEWS
CrimeTelangana

కోడలిపై అఘాయిత్యం.. బాధను దిగమింగిన వివాహిత.. ఆపై కోర్టు సంచలన తీర్పు..

వావి వరసలు తప్పి కొడలు వరసయ్యే మహిళపై రేప్ అటెంప్ట్ చేసిన ఓ ప్రబుద్దిడికి 10 ఏళ్ల జైలు శిక్ష వేసింది ఆసిఫాబాద్ జిల్లా సెషన్ కోర్టు. అంతేకాదు రూ. 20 వేల జరిమానా కూడా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ముకుందరావు తనకు కోడలి వరస అయ్యే వివాహితపై కన్నేశాడు. ఆమె ఒంటిరిగా ఉన్నప్పుడు తప్పుగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. కోరిక తీర్చాలంటూ నిత్యం వేధింపులకు పాల్పడుతూ ఉండేవాడు. అతడి గురించి బయటకు చెప్తే.. కుటుంబం పరువు పోతుందని ఆమె మనసులోని మదనపడుతూ ఉండేది. ఇక ఆమె తనకు దక్కని నిర్ణయించుకున్నాక.. ముకుందరావు వివాహితపై కక్ష పెంచుకున్నాడు. వేరే వాళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఊరంతా ప్రచారం చేశాడు. అయినా ఆమె నిందలను భరించింది తప్పితే.. తన మనసులోని బాధను బయటకు చెప్పుకోలేదు.

Also read :అక్రమంగా గంజాయి రవాణాలో వీరి పాత్రే కీలకం.. దర్యాప్తులో కీలక విషయాలు..

అయితే.. 2021, జనవరి 5 న రాత్రి సమయంలో.. ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించి.. వివాహిత ఇంట్లోకి చొరబడ్డాడు ముకుందరావు. ఆపై ఆమెను బెదిరించి.. లైంగిక దాడికి యత్నించాడు. సరిగ్గా అదే సమయానికి బాధితురాలి భర్త రావటంతో.. అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు ముకుందరావు. దీంతో.. భార్య ఇన్నాళ్లు తాను అనుభవించిన వేదిన భర్తకు చెప్పి బోరుమంది. భర్త మద్దతులో పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. విచారించిన ధర్మాసనం.. సాక్ష్యాధారాలను పరిశీలించి.. ముకుందరావును దోషిగా తేల్చింది. 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 20 వేల రూపాయల జరిమాన విధిస్తూ ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ తీర్పు ఇచ్చారు

Also read :Pawan Kalyan: సార్.. మా అమ్మాయి కనిపించడం లేదు.. వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్..!

Related posts

Share via