చెడు అలవాట్ల బారిన వ్యక్తులు.. వాటి నుంచి బయటపడలేక కన్నవాళ్లనే చిత్రహింసలకు గురిచేస్తున్నారు. డ్రగ్స్ మత్తులో పిచ్చిగా ప్రవర్తిస్తూ కన్నవాళ్లనే కడతెరుస్తున్నారు. డ్రగ్స్ తీసుకొవద్దు అన్నందుకే కన్న తండ్రిని హతమార్చాడో ఓ కొడుకు. మాదకద్రవ్యాలు తీసుకొవద్దని చెప్పిన తండ్రికి నిప్పు పెట్టి చంపేసిన ఘటన హైదరాబాద్ శివారులో కలకలం రేపింది. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ తుర్కయంజాల్ లో చోటుచేసుకుంది. ఆదిబట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండ్రి తిరుపతి రవీందర్ (54)తో తిరుపతి అనురాగ్ (28) అయిన కొడుకు మధ్య ప్రతిరోజు చిన్న పాటి గొడవలు జరుగుతుండేవి. కొడుకు డ్రగ్స్ తీసుకోవడమే ప్రధాన కారణం.
అయితే డ్రగ్స్ మత్తులో ఉండడంతో తుర్కయంజాల్ లో తండ్రికి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలు చుట్టుముట్టడంతో తండ్రి సహాయం కోసం ఆరిచాడు. అయినా అనురాగ్ నిర్దాక్షిణ్యంగా తలుపును మూసివేసి, తన తండ్రిని లోపల ఒంటరిగా వదిలేశాడు. రవీందర్ తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, కాలిన గాయాలతో మరణించాడు. వారి ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలో పడిపోయాడని పోలీసులు తెలిపారు
స్థానికులు హుటాహుటిన రవీందర్ ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషాద ఘటన అనంతరం అనురాగ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆరు నెలల క్రితం మాదకద్రవ్యాల వ్యసనం కారణంగా కొడుకు ఉద్యోగం కోల్పోయినట్లు విచారణలో తేలింది. ఆదిబట్ల పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అనురాగ్ తన తండ్రిని అసభ్య పదజాలంతో ప్రతిరోజు తిట్టేవాడట. ఆదిబట్ల పోలీసులు అనురాగ్ పై కేసు నమోదు చేసి అనురాగ్ ను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఓజీహెచ్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..