వెల్లుల్ల గ్రామం, జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలంలో ఉంది. ఈ చిన్న గ్రామంలో 70కి పైగా ఆలయాలు, ముఖ్యంగా 54 హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. భక్తుల కోరికలు తీరిన తర్వాత కొత్త ఆలయాల నిర్మాణం ఒక ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రతి ఆలయంలోనూ నిత్య పూజలు జరుగుతాయి.
ఏ గ్రామంలోనైనా ఒకటో, రెండో ఆలయాలు ఉంటాయి. కానీ, ఈ గ్రామంలో మాత్రం ఏకంగా 70కు పైగా ఆలయాలు ఉన్నాయి. అందులో 54 హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. అయితే ప్రతి ఆలయంలో నిత్యం పూజలు జరుగుతున్నాయి. ఈ గ్రామాన్ని ఆధ్యాత్మిక గ్రామంగా పిలుస్తారు. అయితే మరి ఈ గ్రామంలో ఎందుకు ఇన్ని ఆలయాలు నిర్మించారో తెలుసుకుందాం.. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో 2 వేలకు పైగా జనాభా ఉన్నారు. జనాభా పరంగా, విస్తీరణం పరంగా వెల్లుల్ల గ్రామం చిన్నదే అయినప్పటికీ.. ఆ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది.
చాలా పురాతమనమైన ఈ గ్రామంలో 70కు పైగా ఆలయాలు ఉన్నాయి. గతంలో ఉండే ఆలయాల్లో కోరిన కోరిక తీరితే.. కొత్త ఆలయాలు నిర్మిస్తామని భక్తులు మొక్కుకునే వారు. అలా కోరిన కోరికలు తీరిన వారు ఆలయాలు నిర్మిస్తూ వస్తున్నారు. ఆ ఆనవాయితీ అలా కొనసాగుతోంది. అయితే ఈ గ్రామంలో హనుమాన్ భక్తులు ఎక్కువగా ఉంటారు. ప్రతి హనుమాన్ జయంతీకి హనుమాన్ మాలలు ధరించి ఉపవాసం ఉంటారు. మొత్తం 70 ఆలయాల్లో అత్యధికంగా 54 ఆలయాలు హనుమాన్ ఆలయాలే ఉన్నాయి.
ఈ గ్రామంలో అడుగు పెట్టగానే ఆధ్మాత్మిక వాతవరణం కనబడుతుంది. ప్రతి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. గతంలో కూడా ఇక్కడ స్వయంభూ ఆలయాలు ఉన్నాయి. అయితే.. స్థానికులే ఎక్కువగా ఆలయాలు నిర్మించారు. ఇక్కడ ప్రతి పర్వదినం ఘనంగా నిర్వహించుకుంటున్నారు. వెల్లుల్ల గ్రామాన్ని దేవాలయాల గ్రామంగా పిలుస్తున్నారు. అంతేకాదు ఈ గ్రామంలో ఉన్న ఆలయాలను చూసేందుకు ఇతర గ్రామాల ప్రజలు కూడా వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఆలయాలు ఉన్న గ్రామం ఎక్కడా లేదు
