February 24, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Vizag: కడుపులో నొప్పిగా ఉందంటూ ఫ్రెండ్‌కి మెసేజ్ చేసిన 10వ తరగతి బాలిక.. వచ్చేలోపే

విశాఖలో పదిహేనేళ్ల బాలిక.. ఉన్నట్టుండి అపార్ట్‌మెంట్ పైకి వెళ్లింది.. ఏమైందో ఏమో కానీ భవనంపై నుంచి దూకేసింది.. కళ్లద్దాలు, మొబైల్ ఫోన్.. చేతికున్న బ్రాస్లెట్ పక్కనపెట్టి.. ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు స్నేహితురాలికి ఇంటికి రావాలని కోరింది.. అనారోగ్యంతో కడుపునొప్పి తీవ్రంగా ఉందని చెప్పింది.. స్నేహితురాలు వచ్చేలోపే..


విశాఖ అక్కయ్యపాలెంలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎన్జీవోస్ కాలనీలో తల్లిదండ్రులు, సోదరితో కలిసి నివాసం ఉంటుంది బాలిక. సీతమ్మధారలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అయితే అనారోగ్యం కారణంగా గత ఏడాది సెప్టెంబర్‌లోనే స్కూల్ మాన్పించారు తల్లిదండ్రులు. ఏమైందో ఏమో కానీ మంగళవారం నాడు తన కడుపు నొప్పి తీవ్రంగా వస్తుందని కుటుంబ సభ్యులకి చెప్పింది. నొప్పి తగ్గేందుకు డాక్టర్లు ఇచ్చిన కొన్ని లిక్విడ్స్ ఇచ్చారు పేరెంట్స్. అయినా పెయిన్ తగ్గకపోవడంతో.. తన స్నేహితురాలికి మెసేజ్ పంపింది బాలిక. మాట్లాడేందుకు ఇంటికి రావాలని కోరింది. ఆమె వచ్చేలోపే బాలిక అపార్ట్‌మెంట్ భవనం పైకి ఎక్కి దూకేసింది. భారీ శబ్దం రావడంతో చూసేసరికి రక్తపు మడుగులో పడి ఉంది బాలిక. వెంటనే కుటుంబ సభ్యులు స్థానికులు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. మార్గ మధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది.

ఫోర్త్ టౌన్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులని విచారించారు. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచిన చిన్న కూతురు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు

Also read

Related posts

Share via