March 15, 2025
SGSTV NEWS
CrimeTelangana

Telangana: దారుణం.. భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య


జగిత్యాల జిల్లా పొలాసలో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పంటించడం కలకలం రేపింది. తన భర్త కమాలకర్‌కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాని.. మరో పెళ్లి కూడా చేసుకొని తమను వేధిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది

జగిత్యాల జిల్లా పొలాసలో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పంటించడం కలకలం రేపింది. అయితే తన భర్త కమాలకర్‌కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాని.. మరో పెళ్లి కూడా చేసుకున్నామని ఆమె ఆరోపణలు చేస్తోంది. అంతేకాదు ప్రతిరోజూ తమకు చిత్రహింసలు పెడుతున్నడని.. అందుకే ఆయనపై పెట్రో పోసి నిప్పంటించినట్లు చెప్పింది.

తన భర్త గత కొన్ని నెలలుగా మద్యానికి బానిపై తమను వేధింపులకు గురిచేస్తున్నాడని వాపోయింది. ఆఖరికీ పిల్లలను కూడా కొడుతుండటంతో ఓపిక నశించిందని.. అందుకే తన భర్తపై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు చెప్పింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన కమాలకర్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది

ఇదిలాఉండగా ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఏకంగా హత్యలకు దారితీస్తున్నాయి. భార్యను భర్త చంపడం లేదా భర్తను భార్య చంపడం లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అక్రమ సంబంధాలు, మద్యానికి బానిస అయ్యి కుటుంబాన్ని వేధించడం, కట్నం వేధింపులు లాంటి గొడవలు హత్యలకు దారి తీస్తున్నాయి

Also read

Related posts

Share via