ఏపీ అన్నమయ్య జిల్లాలో దారుణం జరుగుతోంది. పెద్దతిప్పసముద్రంలోని కస్తూర్భా బాలికల పాఠశాలలో టీచర్స్ ఘోరాలకు పాల్పడుతున్నట్లు బయటపడింది. సమయానికి భోజనం పెట్టట్లేదని, నెలసరి సమయంలో ప్రూఫ్ చూపించాలంటూ టార్చర్ చేస్తున్నట్లు బాలికలు కన్నీటి పర్యంతమయ్యారు
Kasturba Hostel: ఏపీలో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గం పెద్దతిప్పసముద్రం మండలంలోని ములకలచెరువు బాలికల విద్యాలయంలో టీచర్స్ ఘోరాలకు పాల్పడుతున్నట్లు బయటపడింది. పాఠశాలలోని విద్యార్థినిలతో వెట్టిచాకిరీలు చేయించుకుంటూ పురుగుల ఆహారం పెడుతున్నారని సామాజిక తనిఖీ అధికారుల ముందు బాలికలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నెలసరి సమయాలలో శానిటేషన్ కిట్ అడిగితే ప్రూప్ ఏమిటని బట్టలు విప్పి చూపించమంటున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు. విద్యార్థినిలతో రాత్రి సమయాల్లో ఒళ్ళు పట్టించుకోవడం, పాత్రలను కడిగించడం చేస్తున్నట్లు తెలిపారు.
ఒక రూమ్ లో బంధించి తాళం వేసి..
ఇక భోజనం కూడా సరైన సమయంలో పెట్టట్లేదని వాపోయారు. రాత్రి సమయాలలో విద్యార్థినులందరినీ ఒక రూమ్ లో పెట్టి తాళం వేసి లైట్లు ఆఫ్ చేసినట్లు చెప్పారు. పాఠశాలలో ఆహార సామాగ్రిని తమ సొంత ఇళ్లకు తీసుకెళ్తున్నారని, ఈ విషయాలను ఎవరికైనా చెబితే స్కూలు యాజమాన్యం మమ్మలను టార్గెట్ చేసి పరీక్షల్లో మార్కులు లేకుండా చేస్తామని కొడుతున్నారని చెప్పారు. విద్యార్థినిలు ఆవేదన విని ఎమోషనల్ అయిన సామాజిక తనిఖీ సిబ్బంది.. ఇంత ఘోరంగా ఎక్కడే చూడలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను పూర్తిస్థాయిలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇక్కడి సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025