నేను ఎన్నారై, అమెరికాలో అమ్మ పెద్ద డాక్టర్.. ఆమె ఇండియాకు రాగానే పెళ్లి చేసుకుందాం అంటూ మ్యాట్రిమోనీ తరహా వెబ్ సైట్లలో ఫేక్ ఇన్ ఫర్ మెషన్ తో అమ్మాయిలను మోసం చేసి వారి నుంచి డబ్బులు కాజేసిన మోసగాడని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నేను ఎన్నారై, అమెరికాలో అమ్మ పెద్ద డాక్టర్.. ఆమె ఇండియాకు రాగానే పెళ్లి చేసుకుందాం అంటూ మ్యాట్రిమోనీ తరహా వెబ్ సైట్లలో ఫేక్ ఇన్ ఫర్ మెషన్ తో అమ్మాయిలను మోసం చేసి వారి నుంచి డబ్బులు కాజేసిన మోసగాడని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్ష చెరుకూరి(33) బీటెక్ చేయడానికి 2014లో హైదరాబాద్ కు వచ్చాడు. బీటెక్ మధ్యలోనే ఆపేసి 2015లో ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. అంతేకాకుండా జాబ్ కన్సల్టెన్సీ అంటూ కొంతమందిని మోసం చేసిన కేసులో అరెస్ట్ అయి బయటకు వచ్చాడు. అయిన బుద్ది ఏ మాత్రం మారలేదు. ఆ తరువాత సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తన ఆదాయంలో ఎక్కువగా సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నట్లుగా నమ్మించి, దాదాపు 1000 మంది నుంచి డబ్బు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా యానాంలోని ఓ ఎమ్మెల్యే ఫొటోను సోషల్ మీడియాలో డీపీగా పెట్టుకుని ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానంటూ 50 మంది నుంచి రూ.2.50 కోట్లు కాజేశాడు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు రెండేళ్ల క్రితం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మ్యాట్రీమోనీ తరహా వెబ్ సైట్ లలో
ఇన్ని కేసులు, అన్ని సార్లు జైలు శిక్ష అనుభవించిన మనోడికి ఎక్కడా కూడా బుద్ది రాలేదు. మనసు మారలేదు. ఈ సారి మోసాలకు పెళ్లి సంబంధాలను ఎంచుకున్నాడు. మ్యాట్రీమోనీ తరహా వెబ్ సైట్ లలో తప్పుడు సమాచారం పెట్టి.. తాను ఓ ఎన్నారై అని తనది ఐటీ ఉద్యోగమని అమ్మ అమెరికాలో పెద్ద డాక్టర్ అంటూ రెండో పెళ్లి కోసం చూస్తున్న వారు, 30 ఏళ్ల వయసు దాటిన వారినే టార్గెట్ గా వల విసిరేవాడు. వాట్సప్ కాల్ ద్వారా చాటింగ్, కాల్స్ ద్వారా మంతనాలు జరిపేవాడు. తనమీద అమ్మాయిలకు నమ్మకం కుదిరాక తన బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయని.. ఐటీ అధికారులు డబ్బు తీసుకెళ్లారని, కుటుంబ సభ్యులు ఆసుపత్రుల్లో ఉన్నారంటూ కథలు అల్లేవాడు. అలా ఒక్కొక్కరి నుంచి రూ.5-25 లక్షల వరకూ కాజేశాడు. కొన్నిరోజులకు బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తే వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. అందులో భాగంగానే ఇటీవల జూబ్లీహిల్స్‌కు చెందిన ఒక డాక్టర్ వద్ద కూడా ఇలానే రూ.11 లక్షలు కాజేశాడు. దీంతో ఆమె జూబ్లీహిల్స్ పోలీసులుకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని బెంగుళూరులో అరెస్ట్ చేశారు.
Also read
- Palnadu: 100 గ్రాముల బిస్కెట్ 6 లక్షలకే.. లచ్చలు.. లచ్చలు ఇచ్చేశారు.. కట్ చేస్తే..
- బీచ్‌కు వెళ్తే అర్ధరాత్రి అలజడి.. కారు కింద తిష్ట వేసుకుని.. వామ్మో వీడియో చూస్తే..!
- దారుణం.. హోలీ రోజు ఫుల్‌గా తాగి కొట్టుకుని చనిపోయిన ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్!
- మార్ఫింగ్ ఫోటోలతో బెదిరించి ఒకడు.. వీడియో తీసి మరోకడు..స్కూల్ విద్యార్థినిపై లైంగిక దాడి
- లవర్‌తో మాట్లాడుతూ దొరికిపోయింది.. ప్రశ్నించిన భర్త ప్రైవేట్ పార్ట్స్ కోసేసింది!