రొళ్ల: కాకి గ్రామంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అదే ఇంటి పైకప్పు మీద నుంచి యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శివన్న, రాధమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు సంతానం. శివన్న ఆరేళ్ల క్రితం చనిపోయారు. కుటుంబ పోషణ నిమిత్తం రాధమ్మ బెంగళూరుకు వలస వెళ్లింది.

రెండో కుమార్తె గ్రామంలోనే ఉంటూ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తోంది. పెద్ద కుమార్తె మేఘన (20) బెంగళూరులో పీజీ (పేయింగ్ గెస్ట్) రూంలో ఉంటూ డిప్లొమా పూర్తి చేసింది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. మంగళవారం ఉదయాన్నే స్వగ్రామం చేరుకుంది. ఏం జరిగిందో తెలియదు కానీ కొంతసేపటి తర్వాత ఇంట్లో విగతజీవిగా పడి ఉంది. గ్రామానికి చెందిన మంజునాథ్ అనే యువకుడు మేఘనను ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చాడు.
అసలు ఏం జరిగిందో కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు. ఆమె ఎలా చనిపోయింది.. యువకుడు ఇంట్లోంచి ఎందుకు బయటకు తీసుకొచ్చారు అని చర్చించుకో సాగారు. ఇంతలోనే ఇంటి పైకప్పు ఎక్కి మంజునాథ్ కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువతి మృతి.. యువకుడి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025