July 3, 2024
SGSTV NEWS
CrimeTelangana

Bribe: గజానికి రూ.80.. వాహనానికి రూ.45 వేలు



లంచం తీసుకుంటూ సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ బానోతు సురేందర్నాయక్, మేడ్చల్ జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.వెంకట నర్సిరెడ్డి సోమవారం వేర్వేరుగా అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు చిక్కారు.


సూర్యాపేట , మేడ్చల్ కలెక్టరేట్, :లంచం తీసుకుంటూ సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ బానోతు సురేందర్ నాయక్, మేడ్చల్ జిల్లా పరిశ్రమల శాఖ  అసిస్టెంట్ డైరెక్టర్ కె.వెంకట నర్సిరెడ్డి సోమవారం
వేర్వేరుగా అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు చిక్కారు. అనిశా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన మేక వెంకన్న చివ్వెంల మండలం అయిలాపురం సమీపంలో తన పేరిట ఉన్న 1,240 గజాల స్థలంలో కుమార్తె పేరున 1080 గజాలు గిఫ్ట్ డీడ్, 160 గజాలు మరో వ్యక్తికి సేల్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్సురేందర్ నాయక్ ను సంప్రదించారు. సంబంధిత వ్యవసాయ భూమిని వ్యవసాయేతరగా మారుస్తూ నాలా అనుమతి మాత్రమే ఉంది. లేఅవుట్ అనుమతి లేకపోవడంతో గజానికి రూ.100 చొప్పున రూ.1.24 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడు రూ.80 చొప్పున మొత్తం రూ.99,200 చెల్లిస్తానని సబ్ రిజిస్ట్రార్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. డాక్యుమెంట్ రైటర్లు కల్లూరి
శ్రీనివాస్, తంగెళ్ల వెంకట్రెడ్డికి బాధితుడు వెంకన్న లంచం డబ్బులు చెల్లించారు. ఈ విషయాన్ని సబ్ రిజిస్ట్రార్ కు  తెలిపేందుకు కార్యాలయానికి వచ్చిన డాక్యుమెంట్ రైటర్లను అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. సురేందర్నాయక్ 2007లో పరిగి, 2018లో మల్కాజిగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో అనిశాకు పట్టుబడినట్లు ఆ శాఖ నల్గొండ రేంజ్ డీఎస్పీ జగదీశ్చందర్ తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. 

టిప్పర్ తనిఖీ నివేదికకు రూ.50 వేలు డిమాండ్ చేసి..

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కూకట్పల్లి ఎల్లమ్మ బండ ప్రాంతానికి చెందిన కేతావత్ రమేశ్ తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత ఆంత్రప్రెన్యూర్స్ ఇన్సెంటివ్ స్కీమ్ (టీఎస్డ్) పథకంలో రూ.53 లక్షలకు ఓ టిప్పర్ను కొనుగోలు చేశారు. టీఎస్ ప్రైడ్ నుంచి రూ.23 లక్షల రాయితీ రావాలంటే జిల్లా పరిశ్రమలశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.వెంకట నర్సిరెడ్డి తనిఖీ చేసి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నివేదిక ఇచ్చేందుకు రూ.50 వేల లంచం డిమాండ్ చేశారు. రూ. 45 వేలకు బాధితుడు ఒప్పందం చేసుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేక బాధితుడు అనిశా అధికారులను సంప్రదించారు. జీడిమెట్లలో వెంకట నర్సిరెడ్డికి రమేశ్ డబ్బులు ఇస్తుండగా అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ని కలెక్టరేట్లోని శాఖ కార్యాలయానికి తరలించి సోదా చేయగా అక్కడేమీ లభ్యం కాలేదు. నిందితుణ్ని మంగళవారం కోర్టుకు తరలించనున్నట్టు ఏసీబీ డీఎస్పీ, ఆనందకుమార్ తెలిపారు.

Also read

Related posts

Share via