సూర్యపేటలో దారుణం జరిగింది. వెంగమాంబ బాలాజీ హాలో బ్రిక్స్ బట్టీలో పనిచేస్తున్న మైనర్ బాలికపై యజమాని వెంకటరమణ లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై నిర్భయ, పోక్సో, జువెనైల్ జస్టిస్, లేబర్ యాక్ట్ కేసులు పెట్టినట్లు ఆత్మకూర్ SI శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.
TG Crime: తెలంగాణ(Telangana)లో మరో దారుణం చోటుచేసుకుంది. మరో మైనర్ బాలికపై అత్యాచారయత్నం(Minor Girl Rape) జరిగింది. ఈ మేరకు సూర్యపేట జిల్లా ఆత్మకూరు (S) మండలంలోని వెంగమాంబ బాలాజీ హాలో బ్రిక్స్ బట్టీలో పనిచేస్తున్న బాలికపై బట్టీ యజమాని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన బాలిక కేకలు వేయడంతో అతను పారిపోయాడు.
పలు సెక్షన్లకింద కేసులు..
స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై నిర్భయ, పోక్సో, జువెనైల్ జస్టిస్, లేబర్ యాక్ట్ కేసులు నమోదు చేసినట్లు ఆత్మకూర్ SI శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. అయితే బతుకుదెరువు కోసం బీహార్ నుంచి వచ్చిన వారిపై మద్యం మత్తులో యజమాని వెంకటరమణ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డట్లు కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు
ఇదిలా ఉంటే.. రెండు రోజులు క్రితం హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధి ఐడీఏ బండ్లగూడలో 14 రోజులు పాపం చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. తమిళనాడుకు చెందిన ముదులై మణి, ఆరోగ్య విజ్జి(32) దంపతులు బండ్లగూడలో నివాసం ఉంటున్నారు. ఐడీఏ శాస్త్రిపురం అలీనగర్‌లోని ఓ కంపెనీలో కూలీలుగా చేస్తూ జీవనం కొసాగిస్తున్నారు. వీరికి ఏడాది బాబు ఉండగా, మరో పాపకు జన్మనిచ్చింది. అయితే.. భర్త ఆరోగ్యపరిస్థితి బాగోలేదని 14 రోజుల ఆడపిల్లను చంపేసింద తల్లి విజ్జి. ఆడపిల్ల పెద్దయ్యాక చదువు, పెళ్ళి, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయని ముందుగానే భావించి నీళ్ల బకెట్‌లో వేసింది. పోలీసుల కేసు నుంచి తప్పించుకోవడానికి.. గుర్తు తెలియని వ్యక్తులు నీళ్లలో పడేశారని నాటక మాడింది. చివరికి పోలీసు విచారణలో చేసిన తప్పు అంగీకరించింది ఆ కసాయి తల్లి.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025