మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ ఠాణా పరిధి ఘన్పూర్ ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డులో సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ప్రేమజంట ఆత్మాహుతి చేసుకున్న ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్, ఘట్కేసర్ : మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ ఠాణా పరిధి ఘన్పూర్ ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డులో సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ప్రేమజంట ఆత్మాహుతి చేసుకున్న ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
మృతుల్లో ఒకరైన 16 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు ముందు తన తండ్రికి శ్రీరాములు ఫోన్ నుంచి వాట్సాప్లో లొకేషన్, 3 పేజీల లేఖను పంపించినట్లు పోలీసులు గుర్తించారు. ఆందోళన చెందిన బాలిక తండ్రి లొకేషన్ చూపించిన ప్రాంతానికి వెళ్లేలోపే మంటల్లో కాలిపోయారు. మృతురాలి బంధువు, అన్న వరసయ్యే వ్యక్తి వీరి ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెబుతానని తరచూ బ్లాక్మెయిల్ చేయడం వల్లే ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు.
20 లీటర్ల డబ్బాలో పెట్రోలు కొనుగోలు
ఆత్మహత్యకు ముందు ఏం జరిగిందని పోలీసులు దర్యాప్తు చేయగా.. ఘట్కేసర్ మండలం నారపల్లికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని (16)ని సోమవారం ఉదయం ఆమె తండ్రి నారపల్లి సమీపంలోని ఓ ఇంటర్ కళాశాల దగ్గర ఉదయం 8 గంటల ప్రాంతంలో దింపారు. కొద్దిసేపటి తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జమిలాపేట్కు చెందిన శ్రీరాములు (25) కారులో వచ్చి బాలికను తీసుకెళ్లాడు. సాయంత్రం వరకూ ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో కారులోనే సంచరించినట్లు సాంకేతిక ఆధారాలతో పోలీసులు గుర్తించారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఘట్కేసర్ మండలం అన్నోజిగూడలోని ఓ దుకాణంలో 20 లీటర్ల నీళ్ల డబ్బా కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి సమీపంలోని పెట్రోల్ బంక్కు కారులో వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దాదాపు 10-15 లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బంకు సిబ్బంది మాత్రం పెట్రోలు అమ్మలేదని పోలీసులకు చెబుతున్నారు. జనసంచారం తక్కువగా ఉండే ఘన్పూర్ సర్వీసు రోడ్డులోకి వెళ్లి ఆత్మాహుతికి పాల్పడ్డారు.
చింటూపై 108 సెక్షన్
శ్రీరామ్, బాలిక ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు చెబుతానంటూ బ్లాక్ మెయిల్ చేసి రూ.1.35 లక్షలు వసూలు చేసిన ముంత మహేష్ అలియాస్ చింటు (22)పై ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతడిపై ఆత్మహత్యకు ప్రేరేపించానే అభియోగంపై బీఎన్ఎస్ 108 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి స్నేహితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
శ్రీరాములు, బాలిక మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో శవ పరీక్షలు పూర్తయిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్రీరాములు మృతదేహాన్ని జమీలా పేట్కు తీసుకెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం బాలిక మృతదేహంతో కుటుంబ సభ్యులు నారపల్లిలోని మహేశ్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. వారికి పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఉద్రిక్తతల మధ్య బాలిక అంత్యక్రియలు జరిగాయి. ఏకైక కుమారై కావడంతో ఏ కష్టం లేకుండా పెంచామని, తల్లిదండ్రులు విలపించిన తీరు కన్నీరు తెప్పించింది.
Also read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!