ఓ ఫంక్షన్‌కు కట్టుకెళ్లిన రెడ్ శారీ వల్లే వాడి కళ్లల్లో పడ్డా. శారీరకంగా మోసపోయా.. చావే శరణ్యం. చెల్లి కడుపులో మళ్లీ పుడతా’ అని డైరీలో రాసి ఫార్మ్ డి విద్యార్థిని అంజలి ఆత్మహత్యాయత్నం చేసింది. రాజమండ్రిలో ఈ ఘటన జరగగా, ఆమె పరిస్థితి విషమంగా ఉంది
Suicide attempt : “ఓ ఫంక్షన్‌కు కట్టుకెళ్లిన రెడ్ శారీ వల్లే వాడి కళ్లల్లో పడ్డా. శారీరకంగా మోసపోయా.. చావే శరణ్యం. చెల్లి కడుపులో మళ్లీ పుడతా’ అని డైరీలో రాసి ఫార్మ్ డి విద్యార్థిని అంజలి ఆత్మహత్యాయత్నం చేసింది. రాజమండ్రిలో ఈ ఘటన జరగగా, ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆ డైరీలో ప్రస్తావించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిందితున్ని శిక్షిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని గ్రామానికి చెందిన యువతి రాజమహేంద్రవరంలో ఉన్న ఫార్మసీ కాలేజీలో ఫార్మ్ బీ ఫైనలియర్ చదువుతోంది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా యువతి ఓ వైపు చదువుకుంటూనే నగరంలోని ఓ ఆసుపత్రిలో క్లినికల్ ఫార్మసిస్టుగా పార్ట్‌టైం జాబ్ చేస్తోంది. అక్కడే ఆ యువతికి ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన వస్తే అతను అసభ్యకర ఫొటోలు బయటపెడుతా అంటూ బెదిరించాడని ఆ యువతి పేర్కొంది. ఈ క్రమంలో ప్రేమ పేరుతో మోసపోయిన బాధిత యువతి ఆసుపత్రికి వెళ్లి మత్తుమందు తాగి ఆత్మహత్యాయత్ననికి పాల్పడింది
ఈ నేపథ్యంలో బాధిత యువతి సూసైడ్ లేఖలో రాసిన వివరాలు చూస్తే.. ‘‘అమ్మ.. నాన్నా.. నన్ను క్షమించండి. మీకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నా. నా జీవితం నాశనం చేసుకున్న.. ఇక భరించే ఓపిక లేదు. ఓ వ్యక్తి చేతిలో మోసపోయాను. నా భవిష్యత్తు పై ఎన్నో కలలు కన్నా అన్ని ఆవిరయ్యాయి. నేను ఇంత కష్టపడి చదివిన చదువు నా మరణానికే అన్న సంగతి ఇప్పుడే అర్థమైంది. ఓ ఫంక్షన్‌కి కట్టుకెళ్లిన రెడ్ శారీ వల్లే వాడి కళ్లలో పడ్డాను, శారీరకంగా మోసపోయా.. చావే శరణ్యం. చెల్లి కడుపులో పుడతా. ఈ రోజుల్లో ఆడపిల్లలకు రక్షణ కరువైంది. నన్ను ఎంత కొట్టినా, తిట్టినా భరించా. ఇక ఏడ్చే ఓపిక, తట్టుకునే శక్తి లేదు. అతను లైంగికంగా వేధించాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఆడపిల్ల ఉసురు ఊరికే పోదు అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ డైరీలో ప్రస్తావించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటన పై స్పందించిన పోలీసులు నిందితుడిని శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
Also read
- ఈ జన్మలో మీ బాధలకు గత జన్మలోని పాపాలే కాదు.. మరో కారణం ఉంది తెలుసా?
- Jaya Ekadashi: జయ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి
- Rathasaptami 2026: రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎలా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
- Weekly Horoscope: వారికి ఆర్థికంగా అదృష్టం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
- వృద్ధాప్యంలో తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి! ఎక్కడంటే..





