అనంతపురం: కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ వసతి గృహంలో ఉండి చదువుతున్న నలుగురు ఇంటర్ విద్యార్థినులు సూపర్ వేస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నకి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. వసతి గృహంలో క్రమశిక్షణ ఉల్లంఘన జరిగిందని భావించిన హాస్టల్ వార్డెన్, ఈ విషయం గురించి వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తానని విద్యార్థినులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు మందలిస్తారన్న భయంతో ఆందోళన చెందిన ఆ నలుగురు విద్యార్థినులు సూపర్ వేస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
ఈ విషయం గమనించిన వార్డెన్ వెంటనే వారిని చికిత్స నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం బాలికల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థినుల నుండి మౌఖిక వాంగ్మూలం తీసుకోవడంతో పాటు, హాస్టల్ వార్డెన్ వ్యవహారం, కళాశాల పరిపాలనలో ఉన్న లోపాలపై కూడా విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.
Also Read
- చెత్త కుప్పలో డైమండ్ రింగ్స్.. కేటుగాడు వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టిందిలా..
- పెళ్లైన రెండువారాలకే కనిపించని యువతి.. కట్‌చేస్తే.. ప్రియుడితో కలిసి..
- సూర్యుడు అస్తమించగానే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేయండి, లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Kamakshi Deepam: పూజ గదిలో కామాక్షి దీపం ఉందా? అయితే వెలిగించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!





