February 23, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్మ.. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమా?


కడప నాారాయణ కాలేజీ హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి ఉరి వేసుకున్న ఘటన జరిగింది. నిన్న ఆదివారం కావడంతో తల్లిదండ్రులు కొడుకుని చూడటానికి వెళ్లగా ఇంటికి వస్తానని మారం చేశాడు. తండ్రి మందలించడంతో మనస్తాపం చెంది ఆ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కడప నారాయణ క్యాంపస్‌లో మదన్ మోహన్ అనే విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. అయితే నిన్న ఆదివారం కావడంతో తల్లిదండ్రులు కుమారుడిని చూడటానికి హాస్టల్‌కి వెళ్లారు. ఈ కమంలో మదన్ ఇంటికి వస్తానని మారం చేశాడు. దీంతో తండ్రి వద్దని తర్వాత ఇంటికి తీసుకెళ్తా అని మందలించాడు.

మనస్తాపం చెంది హాస్టల్ గదిలోనే..
మనస్తాపం చెందిన మదన్ హాస్టల్ గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్‌ సిబ్బంది గమనించి మదన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. మార్గమధ్యలోనే మదన్ మృతి చెందాడు. సాయంత్రం వరకు కుమారుడితో సంతోషంగా గడిపి ఇంటికెళ్లిన తర్వాత కొడుకు మరణ వార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల తమ కొడుకు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు

ఇదిలా ఉండగా ఇటీవల ఒడిశాలోని మల్కన్‌గిరి అనే జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్‌ డ్రెస్‌లో ఇద్దరు బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. వాటిని చూసిన స్థానికులు షాకైపోయారు. పాఠశాలలో చదువుతున్న ఇద్దరు బాలికలు అదృశ్యమైనట్లు వాళ్ల తల్లిదండ్రులు రెండురోజుల క్రితమే పోలీసులు ఫిర్యాదు చేశారు.

ఫిబ్రవరి 6న మల్కన్‌గరి జిల్లాలో స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు అదృశ్యయ్యారు. స్కూల్‌ నుంచి వాళ్లు ఇంటికి రాలేదు. దీంతో ఆ బాలికల తల్లిదండ్రులు వారికోసం అన్ని చోట్ల వెతికారు. ఎక్కడ చూసినా కనిపించకపోవడంతో చివరికీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగగా.. విద్యార్థులు చెట్టుకు వేలాడుతూ కనిపించారు.

Also read

Related posts

Share via