April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

ఇడుపులపాయ ట్రిబుల్‌ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

వేంపల్లె (కడప) : ఒంగోలు ట్రిపుల్‌ ఐటీకి చెందిన విద్యార్థి జమీషా ఖురేషీ (17) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకొన్న సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే …. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన మొగల్‌ కుమారై జమీషా ఖురేషీ కి ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలో సీటు రావడంతో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ (పి-2) చదువుతున్నది. ఇడుపులపాయ ట్రిపుల్‌ ప్రాంగణంలో ఉన్న ఒంగోలు ట్రిపుల్‌ క్యాంపస్‌ చదువుతున్న జమీషాఖురేషి గత మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో బ్రాత్‌ రూంలో తన చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు ట్రిపుల్‌ ఐటీ అధికారులు తెలిపారు. స్థానిక విద్యార్థుల సమాచారతో ట్రిపుల్‌ ఐటీ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థిని మృతదేహాన్ని అర్థరాత్రి వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం ఫైనల్‌ ఇయర్‌ కు చెందిన ఓ విద్యార్థిని మొబైల్‌ ఫోన్‌ క్యాంటీన్‌ వద్ద పోయింది. ఆ మొబైల్‌ ఫోన్‌ ను మృతి చెందిన అమ్మాయి తీసుకున్న విషయాన్ని గుర్తించిన ట్రిపుల్‌ ఐటి అధికారులు విద్యార్థినిని మందలించడంతోపాటు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారని, తల్లిదండ్రులతో విద్యార్థినితో మాట్లాడించినట్లు తెలిసింది. దీంతో అ విద్యార్థిని జమీషాఖురేషి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. స్టడి అవర్‌ లో విద్యార్థిని కనపడకపోవడంతో విద్యార్థిని కోసం వెతకడం జరిగిందని సిబ్బంది తెలిపారు. అయితే రాత్రి 11 గంటలకు బ్రాత్‌ రూంలో చున్నీతో ఉరి వేసుకొన్న సంఘటన చూసి ఇడుపులపాయలోని ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి వేంపల్లె ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. విషయం కనుగొన్న సమయానికి విద్యార్థిని మృతి చెందినట్లు సిబ్బంది చెప్పారు. విద్యార్థిని మృతి చెందిన విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడ ఇడుపులపాయకు బయలు దేరి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also read

Related posts

Share via