February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrimeSpiritual

Srisailam: శ్రీశైలం ఆలయంలో కొట్లాట.. ఈవో Vs అర్చకులు!


శ్రీశైలం ఆలయంలో అంతర్గత కలహాలు భగ్గుమన్నాయి. ఆరుద్రోత్సవ సుప్రభాతం, హారతి సేవల్లో ఈవో శ్రీనివాసరావు పాల్గొనడం శాస్త్ర విరుద్ధమని అర్చకులు అడ్డుకున్నారు. వెకిలి నవ్వులు నవ్వుతూ ఎగతాళి చేశారు. దీంతో పూజారులపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేశారు

Srisailam: శ్రీశైలం ఆలయంలో అంతర్గత కలహాలు భగ్గుమన్నాయి. ఆరుద్రోత్సవం సందర్భంగా సుప్రభాతం, హారతి సేవల్లో ఈవో శ్రీనివాసరావు పాల్గొనడం శాస్త్ర విరుద్ధమని అర్చకులు అడ్డుకున్నారు. వెకిలి నవ్వులు నవ్వుతూ కైంకర్యాలు నిర్వహించారు. దీంతో పూజారులపై ఈవో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా ఉత్కంఠ నెలకొంది.

ప్రధాన అర్చకుడు ఓవర్ యాక్షన్..
ఈ మేరకు జనవరి 12,13 తేదీల్లో వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహించారు. దీంతో ఆలయ ఈవో శ్రీనివాసరావు ఈ వేడుకలకు హాజరయ్యారు. దీంతో బ్రాహ్మణుడు కాని శ్రీనివాసరావు ఆరుద్రోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం శాస్త్ర విరుద్ధమని ప్రధాన అర్చకుడు వీరన్న మండిపడ్డారు. ఆయన వచ్చినందుకు తాను ప్రధాన పూజలో పాల్గొనట్లేదని కుండబద్ధలు కొట్టేసినట్లు చెప్పేశాడు. దీంతో ఇతర అర్చకులు మొక్కుబడిగా ఆరుద్రోత్సవం నిర్వహించారు. వెకిలి నవ్వులు నవ్వుతూ ఎగతాళిగా వ్యవహరించారు.

ఈ ఘటనతో ఆలయ ప్రధాన అర్చకులు వీరన్న, అధ్యాపక పూర్ణానందస్వామితోపాటు కమిటీ సభ్యులు మార్కండేయ శాస్త్రికి ఈవో మెమోలు జారీ చేశారు. మూడు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని అదేశించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అర్చకుల తీరుపై జనాలు మండిపడుతున్నారు. 

Also read

Related posts

Share via