ఒంగోలు::
శ్రీగిరి పై కొలువైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్కందగిరిపై కొలువైయున్న వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు గంగా పార్వతీ సమేత శ్రీ మహేశ్వరుని దర్శించుకోవడానికి చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా మంగళవారం శ్రీగిరి స్కందగిరి ప్రదక్షిణ సేవ సమితి ఆధ్వర్యంలో వందలాదిగా భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణను చేసి స్వామి వారిని దర్శించుకున్నారు.




స్థానిక శ్రీగిరి పాదపీఠం వద్దగల శ్రీ బాపూజీ గోసంరక్షణ సంఘం గోశాల నుండి, గోమాతను పూజించి, గోమాత ముందు నడువగా శంకు చక్ర నామాలు పట్టుకొని దీప శిఖను తలపై పెట్టుకొని పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పురుషులు గిరి ప్రదక్షిణ చేశారు. స్వామివారి నామస్మరణతో శ్రీగిరి వీధులు మార్మోగాయి.
Also read
- విశాఖ షీలానగర్‌లో మృతదేహాల కలకలం!
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!
- ఆస్తి పిచ్చి.. 62 ఏళ్ల భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
- Hyderabad: రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!
- Andhra Pradesh: పోలీసుల కారు బీభత్సం.. డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు.. అసలు ఏం జరిగిందంటే..?





