SGSTV NEWS
Spiritual

16 నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి నగరోత్సవాలు.

16 నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి నగరోత్సవాలు.

ఒంగోలు::

ఆర్యవైశ్య కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వీధి లో కొలువైయున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో వైశాఖ శుద్ధ అష్టమి 16వ తేదీ గురువారం మొదలు వైశాఖ శుద్ధ దశమి 18 వ తేదీ శనివారం వరకు మూడు రోజులు పాటు నిర్వహిస్తున్న నగరోత్సవ కార్యక్రమాలు గుడి ఉత్సవాలపై ప్రచురించిన కరపత్రములను శ్రీ వాసవి కోలాట భజన మండలి సభ్యులు గుడి ఆవరణలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలను వివరిస్తూ 16వ తేదీ గురువారం ఉదయం 6 గంటలకు మంగళ వాయిద్యముములు మ్రోగుచుండగా 108 కలశములతో 108 మంది మహిళలు *శోభాయాత్ర* గా స్థానిక రంగారాయుని చెరువు వద్ద నుండి తీర్థమును తీసుకుని వచ్చి అమ్మవారికి అభిషేకం నిర్వహించుట. తదుపరి అలంకరణ, అర్చన, పూజాది కార్యక్రమాలు, సాయంత్రం 5గం. లకు గాంధీ రోడ్డు శ్రీ అనంత కోదండరామ స్వామి దేవస్థానం నుండి ఊరేగింపుగా *సారె* తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించుట. తదుపరి గుడి ఉత్సవం, మంత్రపుష్పం, ప్రసాద వినియోగం జరుగును. 17వ తేదీ శుక్రవారం ఉదయం 7 గం.లకు అమ్మవారికి దదియతో అభిషేకం, అలంకరణ, పూజాది కార్యక్రమాలు, సాయంత్రం 5 గం.లకు అమ్మవారికి చందనాలంకారం, వాసవి క్లబ్స్ సంయుక్తంగా ఊరేగింపుగా తీసుకుని వచ్చిన మల్లెలతో *లక్ష మల్లెల అర్చన* తదుపరి గుడి ఉత్సవం, పూజాది కార్యక్రమాలు. 18వ తేదీ ఉదయం 7 గం.లకు పంచామృతాలతో అభిషేకం, 10 గంటలకు *108 మంది కన్నెపిల్లలచే అమ్మవారికి సామూహిక కుంకుమార్చన*, సాయంత్రం 6 గం.లకు అమ్మవారికి నగరోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడును. రాత్రి 7 గం.లకు అన్నకూటోత్సవము, ప్రసాద వినియోగం జరుగునని వివరించారు. కావున భక్తాదులందరూ శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేసి, అమ్మవారి జయంతి ఉత్సవాలను తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఒంగోలు నగర వాసులను కోరారు.

Also read

Related posts

Share this