SGSTV NEWS online
Spiritual

శ్రీకాళహస్తిలో వేడుకగా శ్రీరామనవమి




శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధంమైన శ్రీపట్టాభిరామ మందిరం నందు శ్రీరామనమే వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీసీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. సీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆయా ఆలయాలకు చేరుకున్నారు. రామ నామ జపంతో భక్తజనం భక్తి పారవశ్యంలో మునిగితేలారు. ఆలయ అర్చకులు రామాయణాన్ని ఈ సందర్భంగా భక్తులకు వినిపించారు. అనంతరం శ్రీ కాళహస్తి దేవస్థానం చైర్మన్ శ్రీనివాసుల ఆలయ ఈవో ఎస్ వి నాగేశ్వరరావు భక్తులకు
ప్రసాదవితరణ, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.

Related posts