శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్
శ్రీ బాలా త్రిపుర సుందరీ
రంగు: లేత గులాబి
పుష్పం: తుమ్మి
ప్రసాదం: బెల్లపు పరమాన్నం
శరన్నవరాత్రి ఉత్సవములలో రెండొవ రోజు దుర్గమ్మ బాలత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురిని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థము. మనస్సు, బుధ్ధి, చిత్తము, అహంకారము త్రిపుర సుందరీదేవి అధీనములో ఉంటాయి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన అమ్మను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషము కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రములోని త్రిపురాత్రయములో మోదటి దేవత. కనుక ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహము కోసము బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపురసుందరీదేవి భక్తుల పూజలందుకుంటోంది. ఈ రోజు రెండు నుంచి పదేళ్ళలోపు బాలికలను అమ్మవారి స్వరూపముగా భావించి పూజ చేసి క్రొత్త బట్టలు పెట్టాలి.
ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యెనమోనమః అనే మంత్రాన్ని 108 మార్లు జపించాలి.”
బాలా స్తుతి
ఆయీ ఆనన్దవల్లీ అమృతకర తల్లీ ఆదిశక్తీ పరాయీ మాయా మాయా స్వరూపీ స్పటికమణిమయీ మాతంగీ షడంగీ జ్ఞానీ జ్ఞానస్వరూపీ నళిన పరిమళీ నాద ఓంకార యోగీ యోగీ యోగాసనస్థా భువనవశకరీ సౌన్దరీ ఐం నమస్తే
బాలా మన్డే కటాక్షీ మమహృదయసఖీ ముక్తభావ ప్రచండీ వ్యాళీ యజ్ఞోపవీతే వికట కటి తటీ వీరశక్తీ ప్రసాదీ బాలే బాలేన్దుమౌళే మదగజభుజహస్తాభిషేక్రీ స్వతస్త్రీ కాళీ త్వాం కాలరూపీ ఖగ గలన హృదీ, కారణీ క్లీం నమస్తే
మూలాధారే మహిమ్నీ హుతవహనయనీ మూలమస్త్రీ త్రినేత్రీ హరాః కేయూరవల్లీ అఖిలసుఖకరీ అంబికాయాః శివాయా వేదే వేదాన్తరూపీ వితత ఘనతటీ వీరతస్త్రీ భవానీ శౌరీ సంసార యోనీ సకల గుణమయీ తేద్య శ్రీం సౌః నమస్తే
ఐం క్లీం సౌః సర్వమస్త్రే మమ వరశుభకరీ అంగనా చేష్టితాయా శ్రీం హ్రీం క్లీం బీజముఖ్యెః దినకర కిరణైః జ్యోతిరూపే శివాఖ్యే హ్రీం బ్రీం హ్రూం హేమవర్ణే హిమకరకిరణా భాసమానేన్దుచూడే క్షాం క్షీం క్రూం క్షేమవాసే సకల జయకరీ శక్తి బాలే నమస్తే
శ్రీ త్రిపురసుందరీ స్తోత్రం
కదంబవన చారిణీం మునికదంబకాదంబినీం నితంబజితభూధరాం సురనితంబనీసేవితాం నవాంబురుహలోచనాం అభినంబుదశ్యామలాం త్రిలోకచన కుటుంబినీం త్రిపురసుందరీం మాశ్రయే
కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం మహార్హమణిహారిణిం ముఖసముల్లసద్వాసినీం దయావిభవకారిణీం విశదలోచనీం చారిణీం త్రిలోకచన కుటుంబినీం త్రిపురసుందరీం మాశ్రయే
కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా మదారుణకపోలయా మధురగీతవాచాలయా కయాపి ఘనలీలయా కవచితా వయం శిలయా
కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం షడంబురుహవాసినీం సతతసిద్ధసౌదామినీం విడంబితజపారుచిం వికచచంద్రచూడామణిం త్రిలోకచన కుటుంబినీం త్రిపురసుందరీం మాశ్రయే
కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీం మదారుణవిలోచనాం మనసిజారిసమ్మోహినీం మతంగమునికకన్యకాం మధురభాషిణీమాశ్రయే
స్మరేత్ప్రథమపుష్పిణీం రుధిరబిందునీలాంబరాం గృహీతమధుపాత్రికాం మధువిఘూర్ణనేత్రాంచలాం ఘన స్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం త్రిలోకచన కుటుంబినీం త్రిపురసుందరీం మాశ్రయే
సకుంకుమవిలేపనా మళికచుంబికస్తూరికాం సమందహసితేక్షేణాం శరచాప పాశాంకుశాం ఆశేషజనమోహినీ మరుణ మాల్యభూషాంబరాం జపాకుసుమభసురాం జపవిధౌస్మరేదంబికం
పురందరపురంధ్రికాచికురబంధ సైరంధ్రికాం పితామహపతివ్రతాం పటుపటీర చర్చారతాం ముకుంద రమణీమణీల సదలంక్రీయాకారిణీం భజామి భువనాంబికాం సురవధూటికాచేటికాం
* ఇతి శ్రీ త్రిపురసుందరీ స్తోత్రం *
శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి
త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి! అంకే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల (తిపుర సుందరిదేవి ఆదీనంలో ఉంటాయి.
అభయ హస్త ముదతో, అక్షరమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. నిత్యసంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరిదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమే అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపురసుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్పన చేస్తారు. అసలు బాల త్రిపురు నామమే పరమ పవిత్రమైన నామము.
త్రిపుర సుందరి అని అమ్మని పిలవడములో ఒక రహస్యము ఉంది. అమ్మ, అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇవిడేమో త్రిపుర సుందరి దేవి, అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు. ఆది దంపతులు, వారి తత్వము కుడా అటువంటిది.
త్రిపుర సుందరి అంటే మనలోని మాడు అవస్తలు – జాగృత్తి, స్వప్న, సుషుప్తి! ఈమూడు అవస్తలు లేదా పురములకు బాల అధిమహైన దేవత! ఈ మూడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తు బాలగా అమ్మవారు వినొదిస్తుంది. మనము ఎన్ని జన్ములు ఎత్తిన, ఈ ముడు అవసలులోనే తిరుగుతు ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.
అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది. ఆవిడ ఆత్మ స్వరూపురాలు. ఆవిడను పూజిస్తే జ్నానము కలిగి తానె శివ స్వరూపము తో చైతన్యము ప్రసాదించి, మోక్షమునకు అనగా పరబహ్మతత్వం వైపు నడిపిస్తుంది.
బాలా త్రిపురసుందరి ఆవిర్భావం (బ్రహ్మాండ పురాణం):
భండాసురుని యొక్క పుత్రులు ముప్పెమంది. వీళ్ళు అవిద్యా వృత్తులకు సంకేతం. వారు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ శక్తి సేనలన్నీ కూడా భయపడతాయి. ఆ సమయంలో బాలా త్రిపురసుందరి దివ్యమైన రథాన్ని ఎక్కి బయలుదేరి వచ్చింది. ఆ రథం పేరు కన్యక అనబడే రధం. పైగా హంసలు లాగుతున్నటువంటి రథం. ఆ ఒక్క తల్లి ముప్పెమంది భండాసుర పృతులనూ సంహరించింది. వాళ్ళు సామాన్యులు కారు ఇదివరకటి యుదాలలో ఇంద్రాదులను కూడా గడగదడలాడించినటువంటి వారు. అంత భయంకరమైన భండ పతులు. వారందరినీ ఒక్క తలై కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించిందిట. అది ఈ తల్లి యొక్క ప్రత్యేకత. అంటే బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువలేదు.
బాలోపాసనలో ఉన్నటువంటి విశేషమంతా ఇతివృత్తంలోనే మనకు కనపడుతున్నది. పైగా బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది. అందుకే ఆవిడ హంసలు కూర్చిన రథంపై రావడం అంకే హంసలు అంకే శ్వాసలు అని అర్ధం
ఉచ్ఛ్వాసనిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా ఉత్పేక్షించారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల పాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా చెప్పబడుతున్నది. ఈ బాలా త్రిపుర సుందరీ మంత్రము సిద్ది పొందినటువంటి వారు మాత్రమే అటు తర్వాత షోడశీని ఆరాధించడానికి అర్హులవుతారు. శ్రీవిద్యలో ఒక భాగంగా ఉన్న బాలా విద్య ఒక ప్రత్యేకవిద్యగా కూడా చాలా మంది చేత ఆరాధథింపబడుతోంది. ఈరోజు బాలా మహా త్రిపురసుందరీ రూపంగా ఈ రోజు చేసి ఇక్కడనుంచి నవరాత్రుల ఆరాధన కొనసాగిస్తున్నాం.
ఈ రోజు అమ్మవారు గులాబిరంగు చీరలో మనకు దర్శనమిస్తుంది. అమ్మవారికి ఈ రోజు నైవేద్యం కట్టె పొంగలి. ఇందులో వాడబడే పదార్ధాలు నెయ్యి; పసరపప్పు, బియ్యం. అన్నం బలాన్నిస్తుంది. శరీర కాంతిని పెంపొందిస్తుంది. ఇక పెసరపప్పు త్రిదోషహారి. ఆకలిపుట్రిస్తుంది. నరాలకు బలాన్నిస్తుంది. తేలికగా జీర్ణం అవుతుంది. మిరియాలు జీలకర్ర ఆహారం తేలికగా జీర్ణం కావడానికి ఉపయోగపడతాయి.
బాలా భావనతో కుమారీ పూజ చేసినప్పుడు వాటి ఫలితాలు చెప్పారు. ఏవండీ ఒక్కరోజు ఒక్కసారి పూజచేస్తే చాలు కదా! తొమ్మిది రోజులు చేయాలా? అంటే చేయాలట. బాల పూజ తొమ్మిదిరోజులూ చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉన్నది.
మొదటిరోజు బాల పూజా ఫలితం :
శతృక్షయం ధనాయుష్యం బలవృద్ధిమ్ కరోళవై”
శతృనాశనము, ధనాన్ని, ఆయుష్షునీ, బలాన్ని వృద్ధి చేయడం అనేది మొదటిరోజు చేసే కృమారీపూజయుక్క ఫలం.
శ్రీ బాలాత్రిపురసుందరీ ధ్యాన శోకం :
అరుణకీరణ జాలైః అంచితావకాశా విధృత జపపటీనా పుస్తకాభీతి హస్తా ఇతర కర వరాడ్వా ఫుల్ల కల్హార సంస్థా నివసతు హృది బాలా నిత్వ కళ్వాణ శీలా
ఎర్రని కిరణాలను వెదజల్సుతూ! జప మాల, పుస్తకము, వరద మరియు అభయ హస్తాలతో విరాజిల్లుతూ, విచ్చుకున్న తెల్లని పద్మం పువ్వులో ఆసీనురాలై ఉన్న నీ బాలా త్రిపురసుందరీ దేవి నిత్యమూ నా హృదయమునందు ఉండుగాక అని ఈ శోకం యొక్క అర్తం.
బాలా త్రిపురసముందరి త్రిపురేశైయ్య విద్యహే కామేశ్వర్యాయ్ చ ధీమహీ తన్నో బాలా ప్రచోదయాత్!
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అష్టోత్తరం
ఓం కళ్యాణ్యై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం బాలాయై నమః
ఓం మాయాయై నమః
ఓం త్రిపుర సుందర్యై నమః
ఓం సుందర్యై నమః
ఓం సౌభాగ్యవత్యై నమః
ఓం క్లీంకార్యై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం హ్రీంకార్యై నమః
ఓం స్కందజనన్యై నమః
ఓం పరాయై నమః
ఓం పంచదశాక్షర్యై నమః
ఓం త్రిలోక్యై నమః
ఓం మోహనాధీశాయై నమః
ఓం సర్వేశ్వర్యై నమః
ఓం సర్వరూపిణ్యై నమః
ఓం సర్వసంక్షభిణ్యై నమః
ఓం పూర్ణాయై నమః
ఓం నవముద్రేశ్వర్యై నమః
ఓం శివాయై నమః
ఓం అనంగ కుసుమాయై నమః
ఓం ఖ్యాతయై నమః
ఓం అనంగాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
ఓం జప్యాయై నమః
ఓం స్తవ్యాయై నమః
ఓం శ్రుత్యై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిత్యక్లిన్నాయై నమః
ఓం అమృతోద్భవాయై నమః
ఓం మోహిన్యై నమః
ఓం పరమాయై నమః
ఓం ఆనంద దాయై నమః
ఓం కామేశ్యై నమః
ఓం తరణాయై నమః
ఓం కళాయై నమః
ఓం కళావత్యై నమః
ఓం భగవత్యై నమః
ఓం పద్మరాగ కిరీటిన్యై నమః
ఓం సౌగంధన్యై నమః
ఓం సరిద్వేణ్యై నమః
ఓం మంత్రిణ్యై నమః
ఓం మంత్ర రూపిణ్యై నమః
ఓం తత్త్వత్రయ్యై నమః
ఓం తత్తమయ్యై నమః
ఓం సిద్ధాయై నమః
ఓం త్రిపురు వాసిన్యై నమః
ఓం శ్రియై నమః
ఓం మత్యై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం కౌళిన్యై నమః
ఓం పర దేవతాయై నమః
ఓం కైవల్య రేఖాయై నమః
ఓం వశిన్యై నమః
ఓం సర్వేశ్వర్యై నమః
ఓం సర్వ మాతృకాయై నమః
ఓం విష్ణుస్వ శ్రేయసే నమః
ఓం దేవమాత్రే నమః
ఓం సర్వ సంపత్ప్ర దాయిన్యై నమః
ఓం కింకర్యై నమః
ఓం మాత్రే నమః
ఓం గీర్వాణ్యై నమః
ఓం సురాపానా మోదిన్యై నమః
ఓం ఆధారాయై నమః
ఓం హితపత్నికాయై నమః
ఓం స్వాధిష్టాన సమాశ్రయాయై నమః
ఓం అనాహతాబ్జ నిలయాయై నమః
ఓం మణిపూర సమాశ్రయాయై నమః
ఓం ఆజ్ఞాయై నమః
ఓం పద్మాసనాసీనాయై నమః
ఓం విశుద్ధస్థల సంస్థితాయై నమః
ఓం అష్టత్రింశత్కళా మూర్త్యై నమః
ఓం సుషుమ్నాయై నమః
ఓం చారుమధ్యాయై నమః
ఓం యోగేశ్వర్యై నమః
ఓం మునిద్యేయాయై నమః
ఓం పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర చూడాయై నమః
ఓం పురాగమరూపిణ్యై నమః
ఓం ఐంకారవిద్యాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం పంచప్రణవరూపిణ్యై నమః
ఓం భూతేశ్వర్యై నమః
ఓం భూతమయ్యై నమః
ఓం పంచాశద్వర్ణరూపిణ్యై నమః
ఓం షోడశన్యాస మహాభూషాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం దశ మాతృకాయై నమః
ఓం ఆధారశక్త్యై నమః
ఓం తరుణ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం త్రిపుర భైరవ్యై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం సచ్చిదానందాయై నమః
ఓం సచ్చిదానంద రూపిణ్యై నమః
ఓం మాంగళ్య దాయిన్యై నమః
ఓం మాన్యాయై నమః
ఓం సర్వమంగళా కారిన్యై నమః
ఓం యోగలక్ష్మ్యై నమః
ఓం భోగలక్ష్మ్యై నమః
ఓం రాజ్యలక్ష్మ్యై నమః
ఓం త్రికోణగాయై నమః
ఓం సర్వ సౌభాగ్య సంపన్నాయై నమః
ఓం సర్వ సంపత్తి దాయిన్యై నమః
ఓం నవకోణపురా వాసాయై నమః
ఓం బిందుత్రయ సమన్వితాయై నమః
|| ఇతి శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి సమాప్తం ||
