April 18, 2025
SGSTV NEWS
Spiritual

హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండు సార్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసా..



హిందూ ధర్మంలో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే దైవం హనుమంతుడు. రాము భక్త హనుమాన్ ఆలయం ఎక్కడ చూసినా కనిపిస్తారు. విజయ ప్రదాత, రక్షణ ఇచ్చే దైవంగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. హనుమంతుడిని ఆంజనేయుడు, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు, పవన పుత్రుడు వంటి ఎన్నో పేర్లతో పిలుస్తారు. అయితే హనుమాన్ జయంతి ఉత్సవాలను ఏడాదిలో రెండు సార్లు జరుపుకుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అయితే పురాణాల ప్రకారం ఇలా రెండు సార్లు జన్మదినోత్సవాలు జరుపుకోవడానికి కారణం ఉంది. అది ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..


శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుని ఆరాధన ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. హనుమంతుడు కష్టాలను, దుఃఖాలను, బాధలను తొలగిస్తాడు కనుక సంకటమోచనుడు అని పిలుస్తారు. హనుమంతుడు చిరంజీవి కనుక కలియుగంలో ఇప్పటికీ భూమిపై నివసించే ఏకైక దేవుడు హనుమంతుడు అని.. తన భక్తులను కష్టాల నుంచి కాపాడతాడని హిందువుల విశ్వాసం.


హనుమంతుడి జయంతి రోజు కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయితే హనుమాన్ జయంతిని సంవత్సరానికి ఒకసారి కాదు, రెండుసార్లు జరుపుకుంటారు. అయితే రెండు సార్లు హనుమాన్ జయంతిలను ఎందుకు జరుపుకుంటామో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజు హనుమాన్ జయంతిని రెండుసార్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం..

2025 హనుమాన్ జన్మదినోత్సవం ఎప్పుడు?
ఈ సంవత్సరం చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 12న వచ్చింది. పంచాంగం ప్రకారం చైత్ర పూర్ణిమ తిథి ఏప్రిల్ 12న తెల్లవారుజామున 3:20 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో, ఏప్రిల్ 13న ఉదయం 5:52 గంటలకు ముగుస్తుంది. కనుక ఏప్రిల్ 12న హనుమంతుడి జన్మదినోత్సవ వేడుకలను జరుపుకుంటారు.



హనుమాన్ జయంతిని రెండుసార్లు ఎందుకు జరుపుకుంటారు?
హనుమాన్ జయంతిని సంవత్సరానికి రెండుసార్లు జరుపుకుంటారు. ఒకటి చైత్ర పూర్ణిమ (పుట్టినరోజు) , రెండవది కార్తీక కృష్ణ చతుర్దశి (విజయ అభినందన మహోత్సవం). ఎందుకంటే ఒక కథ హనుమంతుడి జన్మకు సంబంధించినది.. మరొకటి అతను స్పృహ కోల్పోయిన తర్వాత తిరిగి జీవించడానికి సంబంధించినది.

వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడు స్వాతి నక్షత్రంలో కార్తీక మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి రోజున జన్మించాడు. అందువల్ల ఈ రోజును హనుమంతుని అవతార ఉత్సవంగా జరుపుకుంటారు. అదే సమయంలో, చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున హనుమంతుడి విజయ అభినందన మహోత్సవంగా జరుపుకుంటారు.

చైత్ర పూర్ణిమ నాడు మనం హనుమాన్ జయంతిని ఎందుకు జరుపుకుంటాము?
హనుమంతుడు చైత్ర పూర్ణిమ రోజున రెండవ జన్మ లభించింది. కనుక ఈ రోజును అతని విజయ అభినందన మహోత్సవంగా జరుపుకుంటారు.

కార్తీక కృష్ణ చతుర్దశి రోజున హనుమాన్ జయంతిని ఎందుకు జరుపుకుంటారు?
హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక కృష్ణ చతుర్దశి నాడు, తల్లి సీత హనుమంతుడికి అమరత్వం అనే వరం ఇచ్చింది. అందుకే ఈ రోజున హనుమాన్ జయంతిని కూడా జరుపుకుంటారు.

హనుమాన్ జయంతి మొదటి కథ
పురాణాల ప్రకారం ఒకసారి హనుమంతుడు చాలా ఆకలితో ఉన్నాడు. అప్పుడు అతనికి సూర్యుడిని ఒక పండుగా కనిపించదు. దీంతో దానిని తినడానికి పరిగెత్తడం ప్రారంభించాడు. దేవేంద్రుడు ఇంద్రుడు హనుమంతుడిని ఆపడానికి ప్రయత్నించి అతనిపై దాడి చేశాడు. అప్పుడు బాల హనుమాన్ స్పృహ కోల్పోయాడు. తన వరంతో జన్మించిన హనుమంతుడిని చూసి పవనుడికి కోపం వచ్చింది. దీంతో అతను గాలిని ఆపాడు. ఇది మొత్తం విశ్వంలో సంక్షోభ పరిస్థితిని సృష్టించింది.అప్పుడు దేవతలు అందరూ కలిసి హనుమంతుడికి రెండవ జన్మ ఇచ్చారు. అది చైత్ర మాసంలోని పౌర్ణమి రోజు, అందుకే ఈ రోజును హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు.

హనుమాన్ జయంతి రెండవ కథ
మరొక పురాణం ప్రకారం హనుమంతుని భక్తి, అంకితభావాన్ని చూసిన సీతాదేవి అతనికి అమరత్వాన్ని ప్రసాదించింది. హనుమంతుడు ఈ వరం పొందిన రోజు అది కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి. అందుకే ఈ రోజును హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు

Related posts

Share via