హిందూ మంతంలో వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. వాస్తు ఆధారంగానే దశ తిరుగుతుందని విశ్వసిస్తారు. అందుకే ఇల్లు, ఆఫీసులు ఎలాంటి నిర్మాణం అయినా సరే.. తప్పనిసరిగా వాస్తు నియమాలను పాటించి నిర్మిస్తారు. ఇంటి నిర్మాణం పూర్తి వాస్తుతో ఉన్నప్పటికీ, ఇంట్లో ఈ దిశలో ఉంచిన బరువైన వస్తువులు, చెత్తా చెదారం, అశుద్ధ వస్తువులు మీ అదృష్టాన్ని దూరం చేస్తాయని వాస్తు జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాంటి చిన్న చిన్న పొరపాట్లే మీ ఇంటిని పేదరికంలోకి నెట్టివేస్తాయని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
వాస్తు శాస్త్ర నియమాలను పాటించకపోతే, వాస్తు దోషం ఏర్పడుతుంది. వాస్తు దోషం ప్రతికూలత, పేదరికం, అనారోగ్యం, ఇబ్బందులు, సంక్షోభం, ఒత్తిడి, దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.ఇంట్లో వస్తువులను వాస్తు నియమాల ప్రకారం ఉంచకపోతే కూడా ఆ కుటుంబ సభ్యులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.చాలా సార్లు, తెలియకుండానే, మనం ఇంటిలోని కొన్ని మూలల్లో చెత్త, బరువైన వస్తువులను ఉంచుతాము. ఇది భారీ వాస్తు దోషాన్ని సృష్టిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఏ దిశలో చెత్త, బరువైన వస్తువులను ఉంచడం వల్ల ప్రాణాంతకమైన వాస్తు దోషం ఏర్పడుతుందనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
ఈశాన్యం
ఇంటి ఈశాన్య దిశను ఇషాన్ కోన్ అని పిలుస్తారు. ఇది చాలా ప్రత్యేకమైనది. ఇది అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన దిశగా పరిగణించబడుతుంది. ఈ దిశ జ్ఞానం, శాంతి శ్రేయస్సుకు చిహ్నం. అందువల్ల, ఇంట్లోని ఆలయం, పూజా గది ఈశాన్య మూలలో నిర్మించబడుతుంది. పొరపాటున కూడా ఈశాన్య దిశలో చెత్త లేదా బరువైన వస్తువులను ఉంచవద్దు. అలాగే, ఈశాన్య మూలను పొరపాటున కూడా మురికిగా ఉంచవద్దు. ఈ ప్రాంతం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఏమాత్రం అపరిశుభ్రత చేరినా చాలా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చునని నిపుణులు చెబుతున్నారు.
ఈశాన్య దిశను మురికిగా ఉంచడం లేదా బరువైన వస్తువులు, చెత్తను ఇక్కడ ఉంచడం సానుకూల శక్తి ప్రవాహాన్ని ఆపివేస్తుంది. ఇది వాస్తు దోషాన్ని పెంచుతుంది. ఇది ఇంట్లో ఉద్రిక్తతను పెంచుతుంది. పనిలో అడ్డంకులు ఏర్పడుతుంటాయి. పురోగతి ఆగిపోతుంది. ఇంట్లో పేదరికం పెరుగుతుంది. శ్రేయస్సు అంతమవుతుంది. కాబట్టి, ఈశాన్య దిశలో చెత్త, పాత విరిగిన వస్తువులు, పనికిరాని వస్తువులను ఎప్పుడూ ఉంచవద్దు. ఈశాన్య దిశలో బాత్రూమ్-టాయిలెట్ వంటివి ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్మించకూడదని చెబుతున్నారు. ఇది దేవతలకు కోపాన్ని కలిగిస్తుందని అంటున్నారు. అలాంటి కుటుంబంలో సుఖ సంతోషాలు దూరమవుతాయని అంటున్నారు. అంతేకాదు, ఈ దిశలో వంటగదిని కూడా ఏర్పాటు చేయరాదని అంటున్నారు. ఇలా చేయటం వల్ల ఇంట్లోని కుటుంబ సభ్యుల నడుమ మనస్పర్ధాలు, తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తుందని చెబుతున్నారు.
ఈశాన్య మూల శుభ్రంగా, గాలి వచ్చేలా ఉండాలి.
ఈశాన్య దిశను ఎల్లప్పుడూ శుభ్రంగా, గాలి వచ్చేలా ఉంచాలి. ఇది సానుకూల శక్తిని పెంచుతుంది. ఈ ప్రదేశంలో ఒక కిటికీని ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు ఈ మూలలో అందమైన అంలకరణలు, తేలికపాటి వస్తువులను ఉంచవచ్చు. కావాలంటే ఇక్కడ మీరు వాటర్ ఫౌంటెన్‌ను ఉంచవచ్చు. ఈశాన్య దిశలో లేదా ఇషాన్ మూలలో నీటితో నిండిన కుండీని ఉంచడం వల్ల అపారమైన సంపద, శ్రేయస్సు లభిస్తుందని చెబుతున్నారు.
