SGSTV NEWS
Astrology

Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులు, నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు.. 12 రాశుల వారికి వారఫలాలు



వార ఫలాలు (అక్టోబర్ 26-నవంబర్ 1, 2025): మేష రాశి వారికి ఈ వారం ఆర్థిక విషయాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. మిథున రాశి వారికి ఈ వారమంతా మిశ్రమ ఫలితాలతో సాగిపోతుంది. ఆదాయం పెరుగుతుంది కానీ, ఎవరికీ ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?



మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందే అవకాశం ఉంది కానీ, దానధర్మాలు, ఉచిత సహాయాలు బాగా తగ్గించుకోవడం మంచిది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయత్నాల్లో అప్రయత్న కార్యసిద్ధి, వ్యవహార జయం అనుభవానికి వస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో సవ్యంగా చేతికి అందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా, లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా శుభవార్తలు అందుతాయి. కుటుంబ జీవితం చాలావరకు ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం పరవాలేదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

గురు, శనుల అనుకూలత వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారాలు బాగా లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలతో పాటు, బకాయిలు కూడా చేతికి అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి పెళ్లి ప్రయత్నాలకు సంబంధించిన శుభవార్త అందుతుంది. సర్వత్రా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.


మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వారమంతా మిశ్రమ ఫలితాలతో సాగిపోతుంది. ఆదాయం పెరుగుతుంది కానీ, ఎవరికీ ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం మంచిది. డబ్బు ఇచ్చినా, తీసుకున్నా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లోనే కాక, వ్యక్తిగత జీవితంలో కూడా ఏమాత్రం తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా బరువు బాధ్యతలు పెరుగుతాయి. కొందరు బంధువులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. మీ వల్ల కొందరు మిత్రులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు.


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వారమంతా సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఏ పని తలపెట్టినా శ్రమాధిక్యత, వ్యయ ప్రయాసలుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవ కాశం ఉంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం మంచిది. ఒకటి రెండు వ్యక్తి గత సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఎవరికీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.


సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వారమంతా మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది కానీ, అధికారులు, సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. వ్యాపారాలు కొద్దిగా కష్టనష్టాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ చూపిస్తారు. రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరిపోతాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థి కంగా నష్టపోయే సూచనలున్నాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల కొద్దిపాటి లాభాలు కలుగుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. షేర్లు, స్పెక్యులే షన్లు బాగా లాభిస్తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆదాయ పరిస్థితి బాగామెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అనుకో కుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు కొద్దిగా ఆశాభంగాలు తప్పకపోవచ్చు.


తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఇంటా బయటా మీ మాట చెల్లు బాటవుతుంది. ఏ పని తల పెట్టినా విజయం సాధించడం, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావడం, ఆదాయం పెరగడం వంటివి తప్పకుండా జరుగుతాయి. రాదనుకుని వదిలేసుకున్న సొమ్మును పట్టుదలగా రాబట్టుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబ విషయాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వారమంతా నిలకడగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దూరపు బంధువుల్లో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక పరిస్థితికి, ఆదాయ వృద్ధికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ సభ్యుల నుంచి కొద్దిగా ఆర్థికపరమైన ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు కొత్త బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు, కొన్ని వ్యక్తిగత పనులు సకాలంలో పూర్తవుతాయి. అనుకోకుండా ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. తల్లితండ్రుల నుంచి సహాయం లభిస్తుంది.


ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వారమంతా సానుకూలంగా సాగిపోతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ విజయవంతం అవు తాయి. రాశ్యధిపతి గురువుతో సహా గ్రహాలన్నీ చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల ప్రతి ప్రయత్నమూ, ప్రతి వ్యవహారమూ విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. అదనపు ఆదాయాన్ని వృథా చేయకుండా మదుపు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి. కుటుంబ సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరిస్తారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంతో కలిసి విహార యాత్రకు ప్లాన్ వేసే అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఈ వారమంతా ఎక్కువగా శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో మాటకు, చేతకు బాగా విలువ పెరుగుతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలన్నీ సానుకూలంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరిగే అవకాశం ఉంది. సొంత పనుల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. కొందరు బంధుమిత్రులకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆర్థిక విషయాల్లోనూ, ఆరోగ్యపరంగానూ ఈ వారం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. బంధు మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మీరు అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి. రాబడి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. ఆర్థికపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. బాగా మోసపోయే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వారమంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. బంధువుల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వారసత్వ ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. అనుకోని ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఒకటి రెండు శుభ వార్తలు అందుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది

Also read

Related posts