April 28, 2025
SGSTV NEWS
Astro TipsSpiritual

Wearing Toe Rings: వివాహిత స్త్రీ కాలి మెట్టెలు పోగొట్టుకుంటే.. భర్తకు సంబంధించిన ఈ సంకేతాలకు సూచనట



సనాతన ధర్మంలో వివాహిత స్త్రీ కాలి మెట్టెలు వైవాహిక ఆనందానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు. అనేక నమ్మకాలు, సంప్రదాయాలకు సాక్షి కూడా. వివాహిత స్త్రీలు ఎల్లప్పుడూ మెట్టెలను తమ కాలి బొటనవేలుకి పక్కన ఉన్న వేలుకి ధరిస్తారు. శకున శాస్త్రం ప్రకారం కాలి మెట్టులు పోవడం అనేది భర్తకు సంబంధించిన అనేక సంకేతాలు తెలుస్తాయని తెలుస్తోంది.


సనాతన ధర్మంలో స్త్రీలను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. లక్ష్మీ దేవి ఎల్లప్పుడూ ఆభరణాలతో నిండి ఉంటుంది. మహిళల జీవితంలో ఆభరణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని అందరికీ తెలుసు. మహిళల ఆభరణాలను కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా లక్ష్మీ దేవి ఆశీర్వాదంగా కూడా పరిగణిస్తారు. వివాహం తర్వాత మహిళలు తమ కాలి బొటనవేలు పక్కన ఉన్న వెలికి మెట్టెలు ధరిస్తారు. ఈ కాలి మెట్టెలను వివాహిత మహిళలకు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. హిందూ మతంలోని అనేక నమ్మకాలు, సంప్రదాయాలు కాలి మెట్టెలతో ముడిపడి ఉన్నాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం కాలి మెట్టెలను చంద్రునికి చిహ్నంగా భావిస్తారు.


వివాహిత స్త్రీలు ఎల్లప్పుడూ తమ కాలి వేళ్ళకు మెట్టెలు ధరిస్తారు. అయితే ఈ అకస్మాత్తుగా మెట్టెలు పోగొట్టుకుంటే ఏమి జరుగుతుంది? ఈ ప్రశ్న తలెత్తడం సహజం. మెట్టెలు కోల్పోవడం శుభప్రదంగా పరిగణించబడదని నమ్మకం. అంతేకాదు ఇలా జరగడం జీవితంలో ఏదో అశుభాన్ని సూచిస్తుందట.. ఆ 3 సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం..

కాలి మెట్టెలు పోగొట్టుకోవడం అంటే భర్త ఆరోగ్యానికి సంబంధించిన సంకేతం అని చెబుతారు. అంటే భవిష్యత్తులో భర్త ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి వచ్చే అవకాశం ఉంది.


హటాత్తుగా కాలి వేలు నుంచి మెట్టెలు జారి పడితే అది భర్త ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని సూచిస్తుంది అని కూడా అంటారు. ఇది భర్త సంపద లేదా ఉద్యోగ నష్టాన్ని సూచిస్తుంది.

కాలి నుంచి మెట్టెలు పడిపోవడం అంటే కూడా భర్త అప్పుల్లో ఉన్నాడనడానికి సంకేతం అని నమ్ముతారు.

మహిళలకు కాలికి ధరించే మెట్టెలు కేవలం ఒక ఆభరణం కాదు. నమ్మకాలు, సంప్రదాయాలకు రూపం. కనుక మహిళలు తమ కాలి మెట్టెలను సురక్షితంగా ఉంచుకోవాలి, వీలైనంత వరకూ మెట్టెలు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అవి పడిపోతే వాటిని వెదికేందుకు ప్రయత్నించండి. ఒకవేళ అది దొరకకపోతే వెంటనే కొత్త మెట్టెలు ధరించండి. అంతేకాదు కాలి మెట్టెలను తరచుగా మార్చడం కూడా సముచితం కాదు.

Related posts

Share via