April 18, 2025
SGSTV NEWS
Hindu Temple History

Vinayaka Chavithi: ఈ ఆలయంలో నరుడిలా బాల గణపతి.. రాముడితో పూజలను అందుకున్న గణపయ్య ఎక్కడంటే

ఇక్కడ మాత్రం నరుడిగా గణపయ్య దర్శనం ఇస్తాడు. దీంతో ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గణపయ్యను దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని ప్రజలు కూడా ఈ ఆలయంలో పూజలు చేస్తారు. ఈ ఆలయ విశేషాలు, సిద్ధి వినాయకుని నరుడి రూపం గురించి తెలుసుకుందాం.

గణేశుడి ఆలయాలు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నాయి. చాలా మంది భక్తులు గణపయ్యను అత్యంత భక్తిశ్రద్దలతో పుజిస్తారు. అయితే భారతదేశంలోని పురాతన గణేశ దేవాలయాలు వెతికి అవే సొంత పౌరాణిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అయితే ఏ అలయంలోనైనా సరే గణపయ్య రూపం ఏనుగు తల మానవ శరీరంతో భక్తులకు దర్శనం ఇస్తాడు. అయితే ఒకే ఒక గణపతి ఆలయంలో మాత్రం గణపయ్య మానవ రూపంలో దర్శనం ఇస్తాడు. ఆ ఆలయంలో టెంపుల్ స్టేట్ గా పేరు గాంచిన తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఉంది. ఈ ప్రదేశంలో ఉన్న గణపతి దేవాలయం దేశంలోని ఇతర దేవాలయాల కంటే పూర్తిగా భిన్నమైనది. ఎందుకంటే గణపతి దేవాలయాల్లో మాత్రమే కాదు.. ఏ ఇతర దేవతలా అలయల్లోనైనా వినాయక విగ్రహం గజాననునిగా దర్శనం ఇస్తుంది. అయితే ఇక్కడ మాత్రం నరుడిగా గణపయ్య దర్శనం ఇస్తాడు. దీంతో ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గణపయ్యను దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని ప్రజలు కూడా ఈ ఆలయంలో పూజలు చేస్తారు. ఈ ఆలయ విశేషాలు, సిద్ధి వినాయకుని నరుడి రూపం గురించి తెలుసుకుందాం.

నరుడిగా వినాయకుడి విగ్రహం కథ

పురాణాల ప్రకారం శివుడు కోపంతో బాలుడి శరీరం నుండి తలను వేరు చేశాడు. దీని తరువాత వినాయకుడికి ఏనుగు ముఖంతో జీవం పోశారు. అప్పటి నుండి ప్రతి ఆలయంలో ఈ గజాననుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే తమిళనాడులోని తిరువారూరు ఆది వినాయక ఆలయంలో గణపతి ముఖం మనిషిలా దర్శనం ఇస్తుంది. దీనికి కారణం శివుడు పార్వతి దేవి ప్రాణం పోసిన బాలుడు ముఖం శివుడు వేరు చేయక ముందుది అని స్థల పురాణం. బాలుడు ముఖం అందుకనే అందరిలా ఉంది. ఈ కారణంగా గణపతి నరుడి రూపంలోనే ఇక్కడ పూజింపబడుతున్నాడు.

పూర్వీకుల శాంతి కోసం ఇక్కడ పూజలు నిర్వహిస్తారు

రాముడు ఒకసారి ఆది వినాయక దేవాలయంలో తన పూర్వీకుల ఆత్మ శాంతి కోసం పూజలు చేసాడు. అప్పటి నుండి సామాన్య ప్రజలు కూడా పూర్వీకుల ఆత్మ శాంతి కోసం ఈ ఆలయంలో పూజ లు చేయడం ప్రారంభించారు. అందుకే ఈ ఆలయాన్ని తిలతర్పన్‌పురి అని కూడా అంటారు. నది ఒడ్డున శాంతి కోసం పూర్వీకులను పూజిస్తారు. ఆలయం లోపల మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు. ఆలయం సాధారణంగా కనిపించినప్పటికీ.. దేవస్థానం ప్రాముఖ్యత మాత్రం అనంతం. తిలతర్పణపురి అనే పదంలోని తిలతర్పణం అంటే పూర్వీకులకు నైవేద్యం పెట్టడం. పూరి అనే పదానికి నగరం అని అర్థం. వివిధ రకాల కారణాలతో ప్రతిరోజూ నరుడి రూపంలో ఉన్న బాల గణపతిని దర్శించడానికి, పూజించడానికి భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తారు 

శివుడితో పాటు సరస్వతికి కూడా పూజ
ఆది వినాయక మందిరంలో గణేశుడిని మాత్రమే కాదు శివుడితో పాటు సరస్వతిని కూడా పూజిస్తారు. ఫలితంగా మహాదేవుడు, ఆది వినాయకుడితో పాటు సరస్వతీ దేవి ఆశీర్వాదం కోసం భక్తులు కూడా ఇక్కడకు వస్తారు.

స్థల పురాణం

ఆలయానికి సంబంధించిన పురాణాల ప్రకారం రాముడు తన తండ్రి దశరధుడి ఆత్మ శాంతి కోసం ప్రార్థిస్తున్నప్పుడు అతను పెట్టిన బియ్యంతో చేసిన పిండాలు పురుగులుగా మారాయి. దీంతో రాముడు మహాదేవుడిని ప్రార్ధించి పరిష్కారం కోరగా.. ఆదివినాయకుని ఆలయంలో పూజలు చేయమని భగవంతుడు సూచించాడు. పరమశివుని ఆదేశానుసారం శ్రీరాముడు తన తండ్రి ఆత్మకు శాంతి కలగాలని ఈ ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించాడు. పూజ సమయంలో నాలుగు పిండాలు శివలింగంగా మారాయి. దీంతో ఈ నాలుగు శివలింగాలు ఆది వినాయక దేవాలయం సమీపంలోని ముక్తేశ్వర ఆలయంలో ప్రతిష్టించారు.

దేవాలయాలకు సంబంధించిన నమ్మకాలు
ప్రతి ‘సంకష్ట హర చతుర్థి’ రోజున మహాగురువు అగస్త్యుడు స్వయంగా ఆది వినాయకుడిని పూజిస్తాడని భక్తుల నమ్మకం. ఇక్కడ వినాయకుడిని పూజించడం వల్ల కుటుంబ సంబంధాలకు శాంతి కలుగుతుందని, వినాయకుని ఆశీస్సులతో పిల్లల తెలివితేటలు కూడా పెరుగుతాయని కూడా నమ్ముతారు.


Related posts

Share via