వినాయక చవితి పాటించే ప్రతి ఆచారమూ ఇతర పండుగలకి భిన్నంగానే ఉంటుంది. అందులో ఒకటి పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణపతి పూజ పరిపూర్ణం కాదు. ఇలా చవితికి పాలవెల్లిని కట్టడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. చతురస్రాకారంలో ఉన్న ఒక ఊయల వంటి వస్తువుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి.. మామిడి ఆకులూ, కలువ పువ్వులతో అలంకరించి మొక్క జొన్న పొత్తులు, బత్తాయి, దానిమ్మ వంటి ఈ సీజన్ లో దొరికే రకరకాల పండ్లని కడతారు. అయితే ఇలా పాలవెల్లిని ఎందుకు కడతారంటే..
వినాయక చవితి వస్తుందంటే చాలు వారం రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది. వినాయక విగ్రహం తయారీ దగ్గర నుంచి పూజ కోసం పత్రి, పువ్వులు వంటివి సేకరణ వంటివి పిల్లలు ఎంతో భక్తి శ్రద్దలతో చేస్తారు. అయితే వినాయక చవితి పండగను వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు. కొంతమంది వినాయక చవితికి పాలవెల్లిని కడతారు. ఇలా వినాయక చవితి రోజున పాలవెల్లి కట్టే సాంప్రదాయం ఎందుకో నేటి తరంలో చాలా మందికి తెలియదు. మా ఇంట్లో పెద్దలు కట్టారు.. కనుక మేము కూడా పాలవెల్లిని కడుతున్నాంఅని చెప్పేవారు కూడా ఉన్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు వినాయక చవితికి పాలవెల్లిని ఎందుకు కడతారో తెలుసుకుందాం..
వినాయక చవితి పాటించే ప్రతి ఆచారమూ ఇతర పండుగలకి భిన్నంగానే ఉంటుంది. అందులో ఒకటి పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణపతి పూజ పరిపూర్ణం కాదు. ఇలా చవితికి పాలవెల్లిని కట్టడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. చతురస్రాకారంలో ఉన్న ఒక ఊయల వంటి వస్తువుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి.. మామిడి ఆకులూ, కలువ పువ్వులతో అలంకరించి మొక్క జొన్న పొత్తులు, బత్తాయి, దానిమ్మ వంటి ఈ సీజన్ లో దొరికే రకరకాల పండ్లని కడతారు. అయితే ఇలా పాలవెల్లిని ఎందుకు కడతారంటే..
గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా.. సృష్టి, స్థితి, లయలకు ప్రతీక గణపతి. అనంత విశ్వంలో భూమి అణువంతే! భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటానుకోట్లు కనిపిస్తాయి. పాలసముద్రాన్నే తలపిస్తాయి. వీటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటారు. దానికి చిహ్నంగా పాలవెల్లిని వినాయక చవితికి కడతారు. భూమి(సృష్టి)ని సూచిస్తూ మట్టి వినాయకుడు.. జీవానికి (స్థితి) చిహ్నంగా పత్రినీ, ఆకాశానికి (లయం)కి చిహ్నంగా పాలవెల్లిని గణపతి పూజలో పెట్టి ఆరాధిస్తారు.
అమ్మాయిలు చిన్నతనంలో రజస్వల ఎందుకు అవుతున్నారు? నిపుణుల సలహా ఏమిట
గణపతి అంటే గణాలకు అధిపతి.. తొలి పూజను అందుకునే దైవం. కనుక గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడం.. ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని వినాయక చవితికి కడతారు. అంటే పాలవెల్లి సకల దేవతలకూ ప్రతిక. పాలపుంతలో నక్షత్రాలుగా వెలగపండు, మొక్కజొన్నపొత్తులు, మామిడిపిందెలు, జామ, దానిమ్మ వంటి వివిధ రకాల వస్తువులు కడతాము. అవి ప్రకృతికీ చిహ్నం. వినాయకుడు సాక్షాత్తు ఓంకార స్వరూపుడని నమ్మకం. అంతేకాదు ప్రపంచానికి అధిపతి అయిన స్వామికి ఛత్రంగా పాలవెల్లిని కట్టే సాంప్రదాయం ఏర్పడిందట