SGSTV NEWS
Vastu Tips

Vastu Tips: ఇంటి గోడపై రావి చెట్టు పెరిగితే అది శుభమా లేక అశుభమా?



చెట్లు, మొక్కలు భౌగోళిక దృక్కోణంలో మాత్రమే కాకుండా మతపరమైన దృక్కోణంలో కూడా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. చెట్లు, మొక్కలలో దేవతలు నివసిస్తారని నమ్ముతారు. అందుకనే చెట్లు, మొక్కలను పెంచుకునే విషయంలో వాస్తు నియమాలను పేర్కొంది. కొన్ని మొక్కలు ఇంట్లో పెంచుకోవాలని.. కొన్నిటిని ఇంటి ఆవరణలో పెంచుకోవాలని.. కొని చెట్లను ఇంటి పరిసరాల్లో పెంచుకోవడం వలన మన చుట్టూ సానుకూల శక్తి ఉంటుంది.


హిందూ మతంలో ప్రకృతికీ విశేషమైన ప్రాముఖ్యత ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో కూడా దైవాన్ని చూస్తారు. దేవతలు చెట్లలో నివసిస్తారని నమ్ముతారు. అందుకనే చెట్లను పెంచడం వలన సానుకూల శక్తి ఉంటుందని నమ్మకం. చెట్లకు, మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పెట్టడం, వాటిని పూజించడం వల్ల జీవితం నుంచి ప్రతికూలత తొలగిపోతుంది. దీనితో పాటు వ్యక్తి మానసికంగా కూడా ప్రశాంతతను అనుభవిస్తాడు. చెట్లలో రావి చెట్టు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ విశ్వాసాల ప్రకారం, బ్రహ్మ, విష్ణు, శివుడు ఆ చెట్టులోనే నివసిస్తారని నమ్మకం. శని దోష నివారణకు కూడా రావి చెట్టును పూజించడం చాలా ప్రాముఖ్యమైనది

అంతేకాదు రావి చెట్టుకి నీరు పోస్తే పాపాలు నశిస్తాయి. అయితే చాలా మంది ఇంటి ఇంటి గోడలపై రావి చెట్టు పెరుగుతుంది. దీనికి కూడా వాస్తు శాస్త్రంలో కొన్ని సూచనలున్నాయి. రావి చెట్టు ఇంటి గోడల మీద పెరిగితే శుభమా లేదా అశుభమా ఈ రోజు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గోడపై రావి చెట్టు పెరిగితే అది అశుభం. ఇది ఇంటి ఆనందం, శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. దీని అశుభ ప్రభావం కారణంగా.. ఆ ఇంట్లో నివసించే వ్యక్తులు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని నమ్ముతారు. అలాగే ఇప్పటికే చేసిన పని కూడా చెడిపోవచ్చు.


సనాతన మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో గోడలలో రావి చెట్టు అకస్మాత్తుగా పెరిగితే.. ప్రధానంగా ప్రతికూల శక్తి ఆకర్షిస్తుంది. తరచుగా ఒత్తిడిని పెంచుతుంది. ఇది మాత్రమే కాదు కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.

ఇంటి గోడలపై రావి చెట్టు పెరిగితే.. దానిని ఇష్టారీతిన నరికివేయడం అనే పొరపాటు చేయకండి. దానిని తొలగించడానికి ముందు పూజ చేయండి. ఆదివారం అనుభవజ్ఞుడైన తోటమాలిని పిలవవండి. దీనితో పాటు చెట్టును తొలగించిన తర్వాత ఆ స్థలంలోని పగుళ్లను సిమెంట్‌తో నింపండి. లేకుంటే అది ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది.

ఇలా తీసిన రావి చెట్టుని మట్టితో పాటు అక్కడ నుంచి తొలగించి దానిని వేరే ప్రాంతంలో, దేవాలయంలో లేదా రోడ్డు పక్కన నాటండి. ఇంటి అంతటా గంగాజలంతో శుద్ధి చేయండి. గోడలపై రావి చెట్టు పెరిగిన తర్వాత,..ఇంట్లో క్రమం తప్పకుండా పూజలు చేసి, కొన్ని శక్తివంతమైన మంత్రాలను జపించండి. ఈ సులభమైన పరిహారం సానుకూలతను వ్యాపింపజేస్తుందని నమ్ముతారు.

Related posts

Share this