సనాతన ధర్మంలో గణపతికి మొదట పూజ చేస్తారు. ఎందుకంటే విఘ్నాలను తొలిగించే విజయాలను ఇచ్చేవాడు అని నమ్మకం. సనాతన సంప్రదాయంలో గణపతిని సద్గుణాల గని అని చెబుతారు. అంతేకాదు గణపతికి వాస్తు శాస్త్రంలో విశేష ప్రాముఖ్యత ఉంది. గణపతి అనుగ్రహం వల్ల ఇంటిలోని వాస్తు దోషాలన్నీ నశిస్తాయి. ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉంటే.. దానిని గణపతి విగ్రహంతో తొలగించవచ్చని చెబుతారు.
హిందూ మతంలోనే కాదు జ్యోతిష్యం, వాస్తు శాస్త్రంలో కూడా గణపతికి విశేష స్థానం ఉంది. తనను భక్తితో పూజించే భక్తుల అడ్డంకులను తొలగిస్తాడు. సిద్ధి, బుద్ధిలు గణపతి భార్యలు… శుభం, లాభం పిల్లలు. కనుక బొజ్జ గణపయ్య మొత్తం కుటుంబం మొత్తం ఆనందం, శ్రేయస్సుని ఇస్తుంది. గణపతి ఎక్కడ ఉంటాడో అక్కడ మంగళుడు ఉంటాడు. అందుకనే గణపతిని మంగళమూర్తి అని కూడా అంటారు. గణేశుడు ఉన్న చోట ఎలాంటి దోషం ఉండదని నమ్ముతారు. గణపతి అనుగ్రహం ఉన్న చోట ఎటువంటి వాస్తు దోషాలున్నా అవి తొలగిపోతాయి.
ప్రధాన ద్వారం వాస్తు దోషం ఉంటే
ఇంటి ప్రవేశ ద్వారంలో ఏదైనా వాస్తు లోపం లేదా ఏ రకమైన అడ్డంకి ఉంటే.. ఆ దోషాన్ని తొలగించేందుకు ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూర్చున్న గణపతి విగ్రహాన్ని ఉంచాలి లేదా గణపతి విగ్రహాన్ని రెండు వైపులా అంటే ఇంటి తలుపు చట్రం ముందు, వెనుక ఉంచవచ్చు.
గణపతి విగ్రహం పరిమాణం గణపతి విగ్రహం ఎప్పుడూ 6 అంగుళాల ఎత్తు లేదా 11 అంగుళాల వెడల్పు కంటే పెద్దదిగా ఉండకూడదు.
గణపతి విగ్రహ పీఠం గణపతి ప్రతిమ వెనుక భాగంలో పేదరికం.. కడుపులో శ్రేయస్సు ఉంటుందని నమ్మకం. కనుక గణపతి విగ్రహాన్ని వెనుక భాగం కనిపించని విధంగా ఉంచండి.
గణపతి విగ్రహాన్ని ఏ దిశలో పెట్టాలంటే ఇంటి ఈశాన్య దిశలో, ఉత్తరం లేదా పడమర దిశలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం శుభప్రదం. గణపతిని పూజించే ఈ పద్ధతి మీకు ఎల్లప్పుడూ ఆనందాన్ని, అదృష్టాన్ని తెస్తుంది. గణపతి విగ్రహం ముఖం ఉత్తరం వైపు ఉండాలి.
ఇంట్లో ఎక్కువగా వినాయక విగ్రహాలు వద్దు అయితే ఇంట్లో ఎక్కువగా వినాయకుడి విగ్రహాలను పెట్టుకోకూడదు. అంతేకాదు విరిగిన విగ్రహాన్ని లేదా చినిగిన వినాయక చిత్ర పటాన్ని ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోకూడదని నమ్ముతారు.
గణేష్ యంత్రాన్ని ఇంట్లో సంపద, ఆనందం, శ్రేయస్సు ,అదృష్టం కలగడానికి గణపతి విగ్రహం వలెనే గణపతి యంత్రాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గణపతి యంత్రం ఇంట్లోకి దురదృష్టం రాకుండా నిరోధిస్తుంది
